Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

‘గరుడవేగ…’ ఘన విజయంతో మంచి గుర్తింపు

garuda
డా.రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కోటేశ్వర్ రాజు నిర్మించిన చిత్రం ‘పిసివి గరుడవేగ…’. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా సినిమా ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల మాట్లాడుతూ “కోల్‌కతాలోని సత్యజిత్‌రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌లో ఫిలిం మేకింగ్ కోర్స్ చేశాను. ఒక విచిత్రం, రాఖీ, లక్ష్మీకళ్యాణం తదితర చిత్రాలకు సహాయ ఎడిటర్‌గా పనిచేసిన నేను ‘ప్రస్థానం’ చిత్రంతో ఎడిటర్‌గా నా కెరీర్‌ను మొదలుపెట్టాను. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘ఎల్‌బిడబ్లు ’ చిత్రం నుంచి ‘పిఎస్‌వి గరుడవేగ…’ వరకు అన్ని చిత్రాలకు నేను ఎడిటర్‌గా పనిచేశాను. గరుడవేగ చిత్రం ఘన విజయంతో ఎడిటర్‌గా నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్ర విజయం ఇచ్చిన ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు నాకు ఫోన్ చేసి అభినందించడం సంతోషంగా ఉంది. ఇక ఎడిటర్‌గా పనిచేసి దర్శకులుగా మారిన హృషికేష్ ముఖర్జీ, రాజ్‌కుమార్ హిరానీలు నాకు రోల్ మోడల్స్. శంకర్, శ్రీకర్ ప్రసాద్ వంటి సీనియర్ ఎడిటర్స్‌కు నేను ఏకలవ్య శిష్యుడిని”అని చెప్పారు.

Comments

comments