Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

సామాన్యులపై గుదిబండ

17 నెలల్లో 19 సార్లు గ్యాస్ ధర పెంపు
అవస్థలు పడుతున్న నిరుపేదలు
సబ్సిడీ, నాన్ సబ్సిడీలపై పెరిగిన ధరలు
సబ్సిడీ సిలిండర్ రూ. 489, నాన్ సబ్సిడీ రూ. 789

                 Gas

మన తెలంగాణ/సిటీబ్యూరో: సబ్సిడీ గ్యాస్ సామాన్యులకు గు దిబండగా మారింది. ప్రతి నెల పె రుగుతున్న సిలిండర్ ధర సామాన్యుడి నడ్డివిరుస్తోంది. గత 17 నె లల్లో ప్రభుత్వం 19 సార్లు సిలిండర్ ధర పెంచింది. నవంబర్ 1వతేదీ తిరిగి ప్రభుత్వం 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ ధరను రూ. 4. 50 పైసలు పెంచింది. దీంతో ప్ర స్తుతం సిలిండర్ ధర రూ. 489. 50 పైసలకు చేరింది. ఈ లెక్కన గత ఏడాదిన్నర కాలంలో ఒక్కో సబ్సిడీ సిలిండర్‌పై రూ. 68 పెరిగినట్లయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో 64 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఈ గ్యాస్ ఏజెన్సీల ద్వారా నగరంలో ఉన్న 12, 82,587 లక్షల మంది వినియోగదారులకు వంట గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం ప్రతి రోజు ఆయా గ్యాస్ కంపెనీల ద్వారా దాదాపు 20 వేల వరకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. ఒక గ్యాస్ వినియోగదారుడికి ప్ర భుత్వం ఏడాదికి 12 సిలిండర్లు మాత్రమే సరఫరా చేస్తోంది. 12 సిలిండర్లు దాటితే వినియోగదారుడు మా ర్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంది. గత ఏడాది జూన్‌లో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.421.50 ఉండగా, ప్రస్తుతం అదే సిలిండర్ ధర రూ. 489.50 పలుకుతుంది. ఈ లెక్కన ఏడాదిన్నర లోపు జిల్లాలోని గ్యాస్ వినియోగదారులపై దాదాపు రూ.49.64 కోట్ల భారం పడింది. అయితే గ్యాస్ సబ్సిడీలకు అంచెలంచెలుగా స్వస్తి పలుకడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల కొంత మేర గ్యాస్ సిలిండర్ ధర ను పెంచాలని నిర్ణయించింది.

దీంతో గత ఏడాది జూన్ నుం చి ఇప్పటి వరకు 17 సార్లు వంట గ్యాస్ ధరను పెంచింది. ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వారా పేదలకు పంపిణీ చేసే బియ్యం, గోధుమల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తరువాత కిరోసిన్ కోటాను తగ్గించి రేటు పెంచింది. రానున్న రోజుల్లో గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని కూడ పూర్తిగా ఎత్తివేయడానికి ప్రతి నెల గ్యాస్ ధరను పెంచుతుంది. నెల నెల గ్యాస్ ధర పెరుగడం వలన సామాన్య ప్రజలు నానా అవస్ధలు పడుతున్నారు. అదేవిధంగా నాన్ సబ్సిడీ గ్యాస్ ధరను కూడా ప్రభుత్వం పెంచింది. అక్టోబర్‌లో నాన్ సబ్సిడీ గ్యాస్ ధర రూ. 695 ఉండగా, ప్రస్తుతం రూ.789కి చేరింది. వీటితో పాటు డెలవరీ బాయ్స్ అదనంగా బాదేస్తున్నారు. ప్రతి సిలిండర్‌పై రూ.20 నుంచి 25 వరకు బాయ్స్ బలవంతంగా వసూలు చేస్తున్నారు.

Comments

comments