Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

వేడి సాంబారులో పడి పాప మృతి

                     Girl

ఆత్మకూర్ (ఎస్): సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్‌లో నాలుగేళ్ల బాలిక వేడి సాంబారు గిన్నెలో పడి చనిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. మోరపాక నాగయ్య, సునీత దంపతుల చిన్న కూతురు కృతిక(5)  ఇంటి వద్ద ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు పొయ్యి మీద ఉన్న సాంబారు గిన్నెలో పడింది. దీంతో కుటుంబ సభ్యులు బాలికను సూర్యాపేట ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ గాంధీకి తరలించాలని వైద్యులు సూచించారు. గాంధీకి తరలిస్తుండగా మార్గం మధ్యలో చిన్నారి మృతి చెందింది. ఇటీవల నాగయ్య తండ్రి చనిపోవడంతో దశదినకర్మలు  నిర్వహించారు. ఇంతలోనే పాప చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Comments

comments