Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

గోదావరితో సస్యశ్యామలం

mike

ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరందిస్తాం
రుద్రంగి మీదుగా జాతీయ రహదారి
నిర్మాణానికి కృషిచేస్తా
కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్

మనతెలంగాణ/చందుర్తి: మెట్ట ప్రాంతమైన ఈ ప్రాంతా న్ని గోదావరి నది జలాలతో సస్యశ్యామలం చేస్తామని కరీ ంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. చం దుర్తి మండలంలోని నర్సింగాపూర్,తిమ్మాపూర్, లింగం పేట గ్రామాల్లో రుద్రంగి మండల కేంద్రంలో పలు అభివృ ద్ధి పనులకు ఎంపి వినోద్‌కుమార్,ఎమ్మెల్యే రమేశ్‌బాబులు ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపి వి నోద్‌కుమార్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం తో వేములవాడ నియోజకవర్గ పరిధిలో గల 98 వేల ఎక రాలకు సాగునీరు అందిస్తామన్నారు.
కాలువ నిర్మాణం పనులు యుద్ధ ప్రతిపాదికను పూర్తి చేస్తామన్నారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి 2,600ల కోట్ల నిధులను కేటాయించామన్నారు. అనుమా నం ఉన్న వారు ఇప్పుడే ఈ మెయిల్ ఐడీ ఇస్తే పూర్తి సమా చారాన్ని ఇస్తామన్నారు. కోరుట్ల నుంచి రుద్రంగి, వేముల వాడ మీదుగా సిరిసిల్ల వరకు జాతీయ రహదారి నిర్మాణా నికి కృషి చేస్తామన్నారు. కల్యాణలక్ష్మీ పథకంలో ౩లక్షల ఆడ పిల్లలకు రూ.75వేలు ఇచ్చామన్నారు. ప్రభుత్వాసు పత్రిలో ప్రసవం అయిన వారికి రూ.12వేలను అందజేస్తు న్నామన్నారు. నగదుతో పాటు కెసిఆర్ కిట్‌ను అందజేస్తు న్నామన్నారు. రైతులకు 24గంటలకు కరెంటును కొనుగో లు చేసి ఇస్తున్నామన్నారు. రానున్న కాలంలో 8వేల మె గావాట్ల విద్యుత్‌ను తయారు చేసే ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రుద్రంగి గ్రామానికి రూ.౩కోట్లు పిం ఛన్ల రూపంలో అందిస్తుందన్నారు. వేములవాడ ఎంఎల్‌ఎ రమేశ్‌బాబు మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయా లనే క ంకణం కట్టుకొని పని చేస్తున్నామన్నారు. ఎల్లంపల్లి ఎత్తి పోతల పథకం ద్వారా రెండు, మూడు మాసాల లోపు సాగు నీరుందిస్తామన్నారు. రుద్రంగి కలికోట చెరువును నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. రుద్రంగిలో గడ పగడపకు సిసి రోడ్డు పనులు చేస్తామన్నారు. మిషన్ కాకతీ య పనులతో చెరువు, కుంటల నిర్మాణం చేపట్టామన్నా రు. బంగారు తెలంగాణ సాధించేందుక సిఎం కెసిఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సి ద్ధంగా ఉన్నారన్నారు.రుద్రంగి ఎల్లయ్యకుంటను మిని ట్యాంక్‌బండ్‌గా మార్చు తానన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్‌పిటిసి సభ్యులు అంబటి గంగాధర్, ఎంపిపి తిప్పని శ్రీనివాస్, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, సెస్ డైరెక్టర్‌లు అల్లాడి రమేశ్, శ్రీనివాస్, రుద్రంగి మార్కె ట్ కమిటీ చైర్మన్ దప్పుల అశోక్, ఉపాధ్యక్షుడు గట్ల మీ నయ్య, నర్సింగాపూర్, రుద్రంగి గ్రామాల సర్పంచ్‌లు మరాఠి వసంతమల్లిక్, బైరి గంగరాజు మల్లయ్య, తహసీల్దార్ రాజగోపాల్‌రావు,నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, ఎర్రం మహేశ్, పోలాస నరేందర్, ఈర్లపెల్లి రాజు, పొన్నాల  శ్రీనివాసరావు, మాడిశెట్టి ఆ నందం, కొమ్ము రమేశ్, గండ్ర లక్ష్మణ్‌రావు, కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు.

Comments

comments