Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

‘ఆక్సిజన్‌’ ప్రీ రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల

Gopichand

హైదరాబాద్‌: గోపీచంద్‌, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆక్సిజన్‌’. ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సోమవారం ప్రీ రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది.  ట్రైలర్‌లో గోపిచంద్ పలికిన ‘ప్రతీ వూరిలో నీలాంటోడు ఒకడు ఉంటాడని తెలుసు.. కానీ నాలాంటోడు ఒకడు వస్తాడని నీకు తెలియదు’,  ‘మన శత్రువుకు ఓ శత్రువు ఉన్నాడని తెలిస్తే.. వాడే వెతుక్కుంటూ వస్తాడు’ అనే డైలాగులు అభిమానులను అలరిస్తాయి. యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించిన పాటలు ఇప్పటికే శ్రోతులను ఆకట్టుకుంటున్నాయి. డేరింగ్ స్టార్ జగపతి బాబు కూడా ఈ మూవీలో ఓ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ఆక్సిజన్‌’ ప్రీ రిలీజ్‌ ట్రైలర్‌ మీ కోసం….

Gopichand’s Oxygen Pre Release Trailer.

Comments

comments