Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

జర్నలిస్టుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

deepam*రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అభ్యున్నతి కొరకు కృషి చేస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని హోటల్ మయూరి కాన్ఫరెన్స్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జర్నలిస్టుల శిక్షణా తరగతులను రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందన్నారు. ఇప్పటి వరకు మూడు సంవత్సరాల్లో రూ.30 కోట్లను విడుదల చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు కీలక భూమిక పోషించారన్నారు. ఉద్యమంలో ప్రజలందరిని భాగస్వాములు చేయడంలో జర్నలిస్టులు శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించేందుకు, ఇండ్ల స్థలాలను ఇప్పించేందుకు కృషి చేస్తుందన్నారు.
శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి: అల్లం నారాయణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన రెండ్రోజుల శిక్షణా తరగతులను జర్నలిస్టులు సద్వి నియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారన్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరణించిన 7గురి జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందించడం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 17900 మందికి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. రాష్ట్రం లోనే 13 కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డుల ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. అలాగే జిల్లాలో ఏర్పాటు చేసే వెల్‌నెస్ సెంటర్లలో వైద్య పరీక్షలు అందిచనున్నామని తెలిపారు. అనంతరం పత్రికాభాష, తప్పోప్పులు, దిద్దుబాటుపై సీహెచ్ మల్లేషం తెలంగాణ జర్నలిజంలో ప్రత్యేక సవాళ్ళపై టంకశాల అశోక్, సీనియర్ జర్నలిస్టులు పలువురు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమలో బోథ్ ఎమ్మెల్యే బాపురావు, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్, నాయకులు మారుతి, రమేష్, అన్వర్, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments