Search
Wednesday 22 November 2017
  • :
  • :

అరుకు వ్యాలీలో గ్రాండ్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

Earbalune

విశాఖపట్నం: విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక స్థలం అరుకువ్యాలీలో ఇంటర్నేషనల్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఇక్కడ టూరిజంను ప్రమోట్ చేయడంలో భాగంగా ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరుగుతున్నది. ఈ బెలూన్ ఫెస్టివల్ మూడు రోజులపాటు జరగనుంది. ఈ ఎయిర్‌బెలూన్ ఫెస్టివల్ ఈవెంట్‌లో యుఎస్, స్విట్జర్లాండ్, జపాన్, మలేషియా, తైవాన్ సహా 13 దేశాలకు చెందిన పర్యాటకులు, ప్రతినిధులు పాల్గోంటున్నారు. ఈవెంట్‌లో ఎయిర్‌బెలూన్స్ సుమారు గరిష్టంగా సముద్రమట్టనికి 50వేల అడుగుల ఎత్తు వరకు వెళతాయని ఈవెంట్ ఆర్గనైజేషన్ ఈ-ఫ్యాక్టర్ సంస్థ సిఈవొ సమిత్ జార్జ్ తెలిపారు. ఎయిర్‌బెలూన్స్ పైకి ఎగిరినప్పడు సాంకేతిక సమస్యలు రాకుండా పలు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లు జార్జ్ పేర్కొన్నారు.

Comments

comments