Search
Tuesday 19 June 2018
  • :
  • :

గుర్మీత్ జైల్లో ఉన్నాడా…?

GURMEET

రోహ్‌తక్ : అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా అధినేత గుర్మీత్ సింగ్ జైల్లో కనిపించడం లేదని రోహ్‌త్ జైలులోని ఓ ఖైదీ తెలిపాడు. రాహుల్ అనే ఖైదీ రోహ్‌తక్ జైలు నుంచి మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ సందర్భంగా రాహుల్‌ను గుర్మీత్ గురించి విలేకరులు ప్రశ్నించారు. తాను గుర్మీత్‌ను జైల్లో చూడలేదని రాహుల్ తెలిపారు. తానే కాదు తన తోటి ఖైదీలు సైతం గుర్మీత్‌ను చూడలేదని స్పష్టం చేశాడు. జైల్లో ఖైదీలు పని చేస్తుంటారని, కానీ గుర్మీత్ మాత్రం పని స్థలంలో ఎప్పుడూ కనిపించలేదని రాహుల్ వెల్లడించాడు. తమ కుటుంబాలు తమను చూసేందుకు వస్తే ఇరవై నిమిషాలే మాట్లాడనిస్తున్నారని, అదే గుర్మీత్‌కు రెండు గంటల సమయం ఇస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. జైల్లో గుర్మీత్‌కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని ఆయన తెలిపారు. ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్‌కు ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. గుర్మీత్‌కు శిక్ష పడిన నెల రోజులకే ఆయన దత్త పుత్రిక హనీప్రీత్‌ను హరియాణా పోలీసులు అరెస్టు చేశారు.

Gurmeet is in jail?

Comments

comments