Search
Wednesday 21 March 2018
  • :
  • :
Latest News

హెయిర్ డైతో జాగ్రత సుమా

Heir-dry-image

ఒకప్పుడు పెద్ద వయసువాళ్లు జుట్టుకు రంగేసుకునేవాళ్లు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం ఇలా రకరకాల కారణాల వల్ల చిన్న పిల్లలకు కూడా జుట్టు తెల్లబడుతోంది. వాటికి ఒకటే ప్రత్యామ్నాయం. జుట్టుకు రంగేసుకోవడం. మరి కొంతమంది ఫ్యాషన్ కోసం, స్టైల్‌గా కనిపించడం కోసం రకరకాల రంగులను వేసుకోవడం మామూలైంది.

తెల్లబడిన జుట్టుకోసం రంగు వేసుకుంటున్నారా, లేదా ఫ్యాషన్ కోసం వాడుతున్నారా అనేదాన్ని బట్టి హెయిర్ డైను
ఎంచుకోవాలి.
నలుపు, బ్రౌన్ రంగులను ఎక్కువగా వాడుతుంటారు. వీటిని కొనేముందు మంచి కంపెనీవి కొనుగోలు చేయడం మంచిది.  మొదటిసారి జుట్టుకు రంగువేసుకుంటున్నట్లయితే, బ్యూటీపార్లర్‌లో ప్రొఫెషనల్ దగ్గర వేయించుకోవాలి.

రంగు వేసుకునే ముందు చెవి దగ్గర ఒక పాయకు రంగువేసి 48 గంటలు పరిశీలించి చూడాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కనిపించకుంటే
రంగు వేసుకోవడం మొదలుపెట్టాలి.

 రంగు అంటకూడదనుకున్న చోట పెట్రోలియం జెల్లీ పూయాలి. మెడ వెనుక భాగాన పాత టవల్‌ను చుట్టాలి. బ్రష్‌ను ఉపయోగించాలి. లేదంటే ఎక్కువ తక్కువలుగా వచ్చి ఎబ్బెట్టుగా కనిపిస్తుంది.

వెంట్రుక పెరుగుతున్న కొద్దీ కుదుళ్ల వద్ద తెల్లగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు మిగతా జుట్టుకు కండిషనర్ అప్లై చేసి కుదురుకు మాత్రం రంగు పూయాలి.
గర్భిణులు రంగును ఉపయోగించకపోవడమే మంచిది. అమ్మోనియా వంటి రసాయనాలు ఉన్న బ్రాండ్స్ ఉపయోగించడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అనిపిస్తే వెంటనే ఆపేయాలి. అమ్మోనియా  లేని బ్రాండ్‌లలో మోనో ఈథేనొలమైన్ వంటి సురక్షితమైన బ్రాండ్‌ను వాడుకోవాలి.
కనుబొమ్మలకు, కనురెప్పలకు డై వాడకూడదు. హెయిర్ డైలోని రసాయనాలు కంటికి హాని చేస్తాయి.

Comments

comments