Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

హాట్ టాపిక్‌గా మారిన హార్దిక్ పటేల్ వీడియో

HARTIK

అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్న గుజరాత్ పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. బిజెపి దీన్ని ఆయుధంగా మలుచుకుంది. ఈ వీడియోలో ఉన్నది తాను కాదని ఇప్పటికే హార్దిక్ పటేల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే హార్దిక్ పటేల్‌కు గుజరాత్‌కు చెందిన యువనేత జిగ్నేష్ మేవాని మద్దతుగా నిలిచారు. సెక్స్ అనేది ఓ ప్రాథమిక హక్కు అని, ఒకరి వ్యక్తిగత గోప్యతను బహిరంగపర్చే హక్కు ఎవరికీ లేదని జిగ్నేష్ ట్వీట్ చేశారు. హార్దిక్ పటేల్ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సోమవారం నాడు గుజరాత్ టివి ఛానళ్లలో హల్‌చల్ చేసింది. బిజెపి కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ వీడియోను రిలీజ్ చేసిందని హార్దిక పటేల్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు హార్దిక్ పటేల్ కొందరు యువకులతో కలిసి మద్యం సేవిస్తున్న వీడియోలు కూడా బయటకొచ్చాయి. మహిళతో సన్నిహితంగా ఉన్న హార్దిక్ వీడియో ఈ ఏడాది మేలో తీసిందిగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో వెలుగులోకి రావడం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ వీడియోను ముందు పెట్టి గుజరాత్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార బిజెపి యత్నిస్తోంది.

Hardik Patel Video Turned into a hot Topic

Comments

comments