Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

మకరాసనంతో ప్రశాంతత

Yoga

ఉరుకులు పరుగులు పెట్టే వారికి ఈ ఆసనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మొసలి ఆకారాన్ని పోలి ఉండే ఈ ఆసనాన్ని ప్రయత్నించి చూడండి.
ఎలా వేయాలంటే..నేలపై వెల్లకిలా పడుకోవాలి.కాళ్లను ఒకచోటకు చేర్చాలి. భుజాలు నేలపై విశాలంగా పరచాలి. పాదాల చివరి భాగం నేలను తాకుతున్నట్లుగా ఉండాలి. తర్వాత మెల్లగా ఎడమ కాలును మడవాలి. మోకాలు ఆకాశాన్ని చూపుతున్నట్లుగా ఉండాలి. అదే సమయంలో కుడి చేయిని ఉన్న దిశకు వ్యతిరేకంగా తిప్పాలి. అలాగే బోర్లపడుకోవాలి. రెండు కాళ్లను ఎడం చేయాలి. కుడిచేయి ఎడమ భుజం కింద ఉండేలా చూడాలి.ఎడమ భుజాన్ని కుడిచేత్తో పట్టుకోవాలి. అలాగే కుడిభుజం కింద ఎడమ చేయి ఉండేలా చూడాలి. కుడి భుజాన్ని ఎడం చేత్తో పట్టుకోవాలి.
ఇప్పుడు మడిచి ఉన్న మోచేతుల వల్ల త్రిభుజాకారం వస్తుంది. నుదుటిని ద్విభుజాకారం దగ్గర ఆనించాలి. కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి.
పొట్ట నిండా గాలి పీల్చుకుంటూ సాధన చేయాలి.

లాభాలు: కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు తగ్గుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు పరిష్కారమౌతాయి.

Comments

comments