Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

మనసున్న మారాజు కెసిఆర్

KADIYAMనాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్షం
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సిర్పూర్‌లో సేవా కార్యక్రమాలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సైతం మధ్యాహ్న భోజనం అమలుకు కృషి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడి

మన తెలంగాణ/కాగజ్‌నగర్‌టౌన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తనదైన శైలిలో పని చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలను ప్రోత్సహించడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమ లు చేస్తున్నారని, ఒక మాటలో చెప్పాలంటే మనసున్న మహారాజు కెసిఆర్ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం కాగజ్‌నగర్ పర్యటనకు వచ్చిన ఉప ము ఖ్యమంత్రి కడియం శ్రీహరి స్థానిక త్రిశూల్ పహాడ్‌పై గల ప్రభు త్వ జూనియర్ కళాశాలలో ముందుగా అదనపు తగరతి గదుల ను ప్రారంభించి కోనేరు చారిటబుల్ ట్రస్ట్  ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సిర్పూర్ నియోజకవర్గంలో ఇక్కడి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఇతర నియోజకవర్గాల శాసనసభ్యులు సైతం ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోనేరు చారిటేబుల్ ట్రస్ట్ సంస్థను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్షల సమయంలో మూడు నెలల పాటు రుచికరమైన భోజనం పెడుతున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. రాష్ట్రంలో విద్య వ్యవస్థను మెరుగుపర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పలు కార్యక్రమాలు చేపడుతున్నారని, పాలన సౌలభ్యం కోసం తెలంగాణలో ఏర్పడిన 31 జిల్లాల్లో ఇప్పటీ వరకు 544 ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ గురుకులాలకు ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు దక్కుతోందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వాఖ్యానించారు. నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్య అందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు సాగుతున్నారని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. యూరోప్, అమెరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు విద్య వ్యవస్థలో అనుసరిస్తున్న విధానాలను తెలంగాణలో కూడా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య బోధనను ప్రారంభించామని పేర్కొన్నారు. ఆడియో, వీడిఓ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశ్యంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో విద్య వ్యవస్థను మెరుగుపర్చడానికి మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతోందని, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడ అమలు కాని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. ఆడ పిల్లల పెళ్లిల్లు భారం కావద్దనే ఉద్దేశ్యంతో షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇవ్వాలనే యోచనతో ముఖ్యమంత్రి కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారని అన్నారు. స్వరాష్ట్రంలో ఎక్కడ కూడా కరెంట్ సమస్య లేదని, శాంతి భద్రతల సమస్య సైతం లేదని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో సైతం ప్రభుత్వం తరపున మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని ప్రారంభించేందుకు త్వరలోనే కార్యచరణను రూపొందిస్తామని అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగపర్చుకొని 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని విజ్ఞప్తి చేశారు. కాగజ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు గదుల నిర్మాణం, ప్రహరీ నిర్మాణం, మైదానం ఏర్పాటు కోసం 2 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం ఈ సందర్భంగా ప్రకటించారు. అదే విధంగా కౌటాల కళాశాల అభివృద్ధి కోసం కూడా కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, ఎంపీ నగేష్, ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రికి రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం
కాగజ్‌నగర్ పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనటానికి శనివారం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ద్వారా కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ ముందు ఉప ముఖ్యమంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి పలు కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్లారు.

Comments

comments