Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు : ఈటల

ETALA

హైదరాబాద్ : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈటల సమాధానం ఇచ్చారు. జాతర నిర్వహణకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయన చెప్పారు. గత ప్రభుత్వాలు ఈ జాతర కోసం అరకొరగా నిధులు విడుదల చేసేవని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతియేటా జాతరకు వంద కోట్లు కేటాయిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ జాతర కోసం ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించామని ఆయన వెల్లడించారు. జాతర సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

Heavy Arrangements to Medaram Jatara

Comments

comments