Search
Monday 11 December 2017
  • :
  • :

మార్కెట్లోకి నోకియా 2

nokia-2-mobile

న్యూఢిల్లీ : హెచ్‌ఎండి గ్లోబల్‌కి చెందిన నొకియా సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా 2 పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.7,500గా ఉండవచ్చని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఫోన్ ధర 99యూరోలు ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంటే భారత్‌లో ఇంకా రేటును ఖరారు చేయలేదు. నవంబర్ రెండో వారం తర్వాత నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. హెచ్‌ఎండి నుంచి వచ్చిన ఫోన్లలో ఇదే అత్యంత చౌకైనది. 4100 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల ఈ ఫోన్ రెండు రోజుల బ్యాకప్ ఇస్తుంది. నోకియా 2 ఫీచర్లు .. 5 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగాపిక్సెల్ వెనుక కెమె, 5 మెగాపిక్సెల్ ముందు కెమెరా, 4100 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.

Comments

comments