Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం

station

*న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గమంటున్న రైతులు
*స్టేషన్ వరకు వచ్చి వెనుదిరిగి పోయిన హెచ్‌టి బాధిత రైతులు

మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి: రైతుల పక్షపాతిగా ఉండాల్సిన పాలనాధికారే తమపై కేసులు పెట్టి పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పితే ఇక మాకు న్యాయం చేసే అధికారులు ఎవరని, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం, న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని మెదక్ జిల్లా హైటెన్షన్ లైన్ల బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పోలీసుల పిలుపు మేరకు పలు మండలాల హెచ్‌టి బాధిత రైతులు మెదక్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. తమ పంటపొలాలు హెచ్‌టి లైన్ల విస్తరణతో నాశనమయ్యాయని, దాని తాలుకు కలెక్టరు దయతలచి తమకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటుందని అనుకుంటే తమపైనే కేసులు పెట్టిస్తారని ఊహించలేమన్నారు. నవంబర్ 1వ తేదీన మెదక్ పోలీసులు ధర్నాలో పాల్గొన్న రైతులకు ఫోన్లు చేసి పోలీస్‌స్టేషన్లకు రావాలన్నారని అందుకే మీమందరం మెదక్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చామన్నారు. రైతు నాయకులు వెళ్లీ పోలీసులను సంప్రదించి మేము ఎటువంటి నేరం చేయలేదు, అయినప్పటికీ మీ పిలుపును గౌరవించి స్టేషన్‌కు వచ్చామని తెలిపారు. పోలీసులు కేవలం అంథోలు క్రిష్ణ అనే ఒక్క రైతుపై మాత్రమే కేసు నమోదు చేశామని, మిగతావాళ్లందరు పేర్లు, చిరునామా రాసి ఇచ్చి వెళ్లి పోవాల్సిందిగా పోలీసులు రైతులకు తెలిపారు.
రైతులకు తెలిపారు. పెద్ద సారు లేడు… ఆయన వచ్చా కా మళ్లీ పిలిపిస్తాం వెళ్లండి అంటూ… స్టేషన్ నుండి పంపించారు. శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో నెలకొన్న హైడ్రామాతో పోలీసుల పిలుపు మేరకు వచ్చిన రైతులు వెను దిరిగి వెళ్లిపోయారు.
పైసలు ఇప్పించుండ్రి సారూ దండం పెడుతాం: మల్లవ్య
సారూ… నా పేరు మల్లవ్వ, మాది పాపన్నపేట మండ లం అవులపురం గ్రామం, మాకు ఉన్న అర ఎకరంలో నే కరెంట్ టవర్స్ పాతారు. వ్యవసాయం చేసుకోవడానికి ఏమి మిగుల కుండా చేశారు సారూ… కాళ్లు మొక్కి బతిమిలాడినా ఇనకుండా టవరు వేశారు. చిల్లి గవ్వకూడా మాకు నష్టపరిహారం ఇవ్వకుండా వెళ్లిపోయా రు. వాళ్ల భాష మాకు అర్థం కాదు, ఎవరిని అడిగితే న్యాయం జరుగుతుందో మాకు తెలియలేదు. అందుకే 30 తారీఖు నాడు కలెక్టర్ అమ్మని మా పొలంలో కరెం ట్ టవరు వేసినందుకు పైసలు ఇప్పియ్యమని వచ్చినం పోలీసోల్లు కేసులు పెట్టిన్నరని చెప్పిడ్రూ.. అందుకే పోలీస్‌స్టేషన్‌కు వచ్చినం. ఎట్లనన్న జేసి మాకు రావాల్సిన పైసలు ఇప్పించుండ్రి సారూ దండం పెడుతాం.
మేము మా బాధ ఎవరితోని చెప్పుకోవాలే: శంకరమ్మ బాధిత మహిళారైతు
నా పేరు శంకరమ్మ, మాది అవులపురం గ్రామం, పాపన్నపేట మండలం, నాకు రెండెకరాల భూమి ఉంది. ఆ రు నెలల కింద పెద్దలైన్ల కరెంటు స్థంబాలు మా పొలం లో వేశారు. మొత్తం వరి పంట వేశాము, దాన్ని మొత్తం టాక్టర్లతో తొక్కేసీ ఒక్క గింజ ధాన్యం కూడా చేతికి రాకుండా జేశారు. పెద్ద లైన్లు వే శారు, లైన్ల కింద కూడా మొ త్తం పంటను తొక్కేసారు, పంట నష్టం, టవర్ వేసిన తాలుకు డబ్బులు కూడా ఇవ్వలేదు. కలెక్టరమ్మ పైసలు ఇప్పిస్తా అంటే పోయినం. కలెక్టరమ్మ మాకు క లవనేలేదు. మేము చెప్పేది కూ డా వినలేదు. ఇంకా మాపైనే పోలీసు కేసులు పెట్టింది. మేము మా బాధ ఎవరితోని చెప్పుకోవాలే సారూ..
మేమేమైనా దొంగలమా: జయరామ్ బాధిత రైతు, బుజరంపేట గ్రామం, కౌడిపల్లి మండలం
నా పేరు జయరామ్, మాది బుజరంపేట గ్రామం, కౌడిపల్లి మండలం, నాకు రెండెకరాల వ్యవసాయ పొలం ఉంది. కరెంటు టవర్లు వేసే వారు వచ్చి మా పొలంలో కొబ్బరి, మామిడి, వేప చెట్లు నరికి నష్టపరిహారం చెల్లిస్తామని రషీదు ఇచ్చారు. కానీ ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. టవరు వేసేటప్పుడు కూడా డబ్బులు ఇస్తామన్నారు. అవి కూడా ఇవ్వలేదు… వారిని గట్టిగా నిలదీస్తే రెండున్నర లక్షల రూపాయలు ఇస్తామని కేవలం 42 వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని, అప్పటినుం డి కనబడకుండా వెళ్లిపోయారన్నారు. ఈ విషయమై కలెక్టర్‌ను అడుగుదామని వెళితే పోలీసులతో మాకు ఫోన్లు జేయించి స్టేషన్‌కు రమ్మని చెప్పిస్తుంది సారూ.. మేమేమైనా దొంగలమా… ఎందుకు మాపై కేసులు పె ట్టారు… రైతులని కనికరం కూడా లేదా మీకు… అప్పు లు చేసి పంటలు పండిస్తే, కాలాలు సరిగ్గా గాక.. పెట్టుబడి కూడా రాని సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎ దురు కావడం చాలా ఇబ్బంది కరంగా ఉంది సారూ…

Comments

comments