Search
Monday 11 December 2017
  • :
  • :

అత్తింటి వారిని డబ్బులు డిమాండ్ చేయలేదు..

SANGITA
హైదరాబాద్: తనకు న్యాయం జరిగేంత వరకు నా దీక్ష విరమించలేదని సంగీత సృష్టం చేశారు. తన అత్తమామలను అరెస్ట్ చేసి, తనకు రక్షణ కల్పించాలని ఆమె నేడు డిమాండ్ చేశారు. తన పాపకు భరోసా కల్పించాలని, అలాగే భార్యగా తనకు దక్కాల్సిన గౌరవం కూడా కావాలన్నారు. తాను అత్తింటి వారిని డబ్బులు డిమాండ్ చేయలేదని తెలిపారు. రూ.3కోట్లు డిమాండ్ చేసినట్టు వచ్చిన వార్తలను ఆమె తోసిపుచ్చారు. తన భర్త పులగండ్ల శ్రీనివాస్‌రెడ్డి ఇంటి వద్ద వరుసగా నాలుగో రోజు ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. నిద్రాహారాలు మాని చంటిపిల్లతో కలిసి ఆమె పోరాటం చేస్తున్నారు. సంగీతను మల్కాజ్‌గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగీతకు న్యాయం చేస్తామని, మరో మహిళకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తామని హామీనిచ్చారు. భరత్ తల్లి దండ్రులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. తాను అత్తమామలను అరెస్ట్ చేసేవరకు దీక్ష కొనసాగిస్తానని సంగీత సృష్టం చేశారు.

Comments

comments