Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

కృషి సించాయ్ లబ్ధిదారులను గుర్తించండి

MEETING

అధిరులకు కలెక్టర్ బుద్ధప్రకాష్ సూచన

మన తెలంగాణ/మావల : గిరిజనుల ఆర్థిక స్థితి గతులను పెంపొందించడానికి ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన పథకం కింద లబ్ధి చేకూరే కుటుంబాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ బుద్ధ ప్రకాశ్ ఎం. జ్యోతి అన్నారు. గురువారం రాత్రి కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గిరిజనులు ముఖ్యంగా పీటీజీల ఆర్థిక ప్రగతిని పెంపొందించడానికి ఆయా రైతులకు యోగ్యంగా వ్యక్తిగతంగా, సామాజికంగా ఉపయోగపడే పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు రూపొందించాలని అన్నారు. ఇప్పటికే పలు శాఖల అధికారులు వివిధ గ్రామాలకు వెళ్లి అక్కడ గిరిజనుల స్థితిగతులు పరిశీలించి వారికి కావాల్సిన వాటిని గుర్తించినట్లు తెలిపారు. బావులు, బోరు బావులు, పైప్ లైన్లు, మేకలు, ఎడ్లు, కోళ్లు వంటివి సమకూరిస్తే వారి జీవనోపాధి మెరుగుపడుతుందని సూచన ప్రాయంగా కలెక్టర్‌కు నివేదించారు. ఈజీఎస్ పథకం కింద కూడా బావులు, చెక్ డ్యాం నిర్మాణ పనులకు జియాలజిస్టు ప్రతిపాదించిన మేరకు పనులను గుర్తించాలన్నారు. రూ.2.80 కోట్ల నిధులు పీఎంకేఎస్‌వై పథకం కింద జిల్లాకు మంజూరయ్యాయని కలెక్టర్ వివరించారు. 12 గ్రామాల్లో ఈ పనులు చేపట్టడానికి ప్రతిపాదించాలన్నారు. అదే విధంగా వర్షాధారిత వ్యవసాయాభివృద్ధి పథకం కింద రూ. 43 లక్షలు మంజూరయ్యాయని, ఆ నిధులతో గిరిజన ప్రాంతాల్లోని రైతులకు వ్యవసాయ సంబంధ పనులకు ప్రతిపాదించాలని సూచించారు. ప్రతీ హాబిటేషన్‌కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశా కుమారి, డీఆర్‌డీవో పీడీ రాజేశ్వర్ రాథోడ్, జిల్లా పశు సంవర్ధక అధికారి శంకర్, జిల్లా ఇరిగేషన్ అధికార సుశీల్, వ్యవసాయ ఏవో శివ కుమార్, హర్టికల్చర్ శాఖ అధికారులు పలువురు పాల్గొన్నారు.

Comments

comments