Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

ఇడ్లీ @ రామస్సెరీ

ఈ ఇడ్లీ స్పెషలేంటో అనుకుంటున్నారా..ఉందండీ. మామూలుగా ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి దాంట్లో పిండిని ఉడికిస్తాం కదా…ఇది మాత్రం కట్టెల పొయ్యి పై పాత్ర స్టీమ్‌లో ఉడికించేది అటు దోశకు ఇడ్లీకు భిన్నంగా ఉండే రూపు.  ఇలాంటిఇడ్లీ రుచి చూడాలంటే మాత్రం కేరళ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. అక్కడికి వెళ్లిన వారు ఈ ఇడ్లీ టేస్ట్ చూడకుండా వెళ్లరు. ఈ ఇడ్లీ కథాకమామిషు ఏంటో చూద్దాం…

                       Idly

ఉత్తర కేరళలోని మారుమూల గ్రామంలో గత 200 ఏళ్ల నుంచీ అక్కడి కుటుంబాలు ఇడ్లీలను వండి వడ్డిస్తున్నాయి. పాలక్కడ్‌కి 12 కి.మీ దూరంలో ఉంది రామస్సెరీ. ఇడ్లీలు తినాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే. కాంచీపురం నుంచి కేరళకు ముదలియార్ కుటుంబాలు పనికోసం వలస వచ్చారు. తమిళనాడులోని తిరుపూర్, తంజావూర్ ప్రాంత ప్రజలు రామస్సెరీలో స్థిరపడ్డారు. పురుషులేమో వీవర్స్‌గాను, మహిళలు రుచికరమైన వంట చేయడంలో ప్రావీణ్యంగలవారు. ఈ రోజుకి రామస్సెరీ 5 ముదలియార్ కుటుంబాలుంటున్నాయి. వాళ్లే ఇడ్లీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక్కడ ఉండే 5 ముదలియార్ కుటుంబాలన్నీ మలయాళంలో మాట్లాడుకుంటారు. వారి భాషలో తమిళం కూడా కలిసి ఉంటుంది. మలయాళ సంప్రదాయాన్ని స్వీకరించారు. ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రతి ఇంట్లో కనీస అవసరాలైన ఫ్రిజ్, టూవీలర్, టీవీలాంటివి ఏర్పాటుచేసుకున్నారు. వీరు వ్యాపారంలో ఒకరితో ఒకరు పోటీ పడరు.

అద్భుత రుచి: సంప్రదాయకమైన ఇడ్లీకి దోసకు మధ్య రూపంలో ఉంటుంది. రామస్సెరీ ఇడ్లీ ఫ్లాట్‌గా ఉంటుంది. మామూలు ఇడ్లీలా మెత్తగా దూదిపంజంగా ఉండదు. సంప్రదాయ ఇడ్లీకి భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఇడ్లీలను ఇడ్లీ పాత్రల్లో పెట్టి స్టవ్‌పై ఉడకనిస్తారు. కానీ ఈ ఇడ్లీ అలాకాదు. కట్టెల పొయ్యిపై ఉడకనిస్తారు. మామూలు ఇడ్లీ కంటే ఎక్కువ పులుయ పెట్టడం ఇక్కడ స్పెషల్. కట్టెల పొయ్యి కూడా ఎక్కువ పొగ రాకుండా ఉండేలా చూసుకుంటారు. గల్ఫ్ దేశాలకు కూడా ఈ ఇడ్లీ రుచి పాకింది. భాగ్యలక్ష్మి భర్త చనిపోవడంతో 22 ఏళ్లుగా ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. తమిళనాడు నుంచి వచ్చే ప్రత్యేక అరి లేదా బియ్యం తీసుకుని మూడు నాలుగు రోజులుండేవారు.

                      Cook

సరస్వతీ టీషాప్ యజమానురాలు భాగ్యలక్ష్మిగతాన్ని గుర్తుచేసుకుంటూ..నాకు 5గురు పిల్లలు. ఇడ్లీ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతోనే వాళ్లందరికీ పెళ్లిళ్లు చేసేశాను. హోటల్‌లో 5గురికి పని కల్పించాను. పాలక్కడ్‌లో పెద్ద హోటల్ తెరవాలని ప్రయత్నిస్తున్నాను. మా అత్తమామల పూర్వీకులు ఇక్కడికి వచ్చినప్పుడు వారి దగ్గర పనిచేసే నేత కార్మికులకు వేతనంగా డబ్బుకు బదులు ఇడ్లీలను ఇచ్చేవారు. పాలక్కాడ్, మదురై ,పాలక్కాడ్ చెన్నై మధ్య రైళ్లు మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ప్పుడు రైళ్లలో ఎటువంటి ఆహార సౌకర్యాలు ఉండేవికావు. అప్పుడు ముదలియార్ కుటుంబాలు ఇడ్లీలను ప్యాక్ చేసి ప్రయాణికులకు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇడ్లీలు, చట్నీ, పొడులను వారం పాటు నిల్వ ఉండేలా తయారు చేసి ప్యాకింగ్ చేసి ఇచ్చేవారు. బ్రాహ్మణ కుటుంబాలైతే కాఫీ డికాక్షన్ తయారు చేయించి తీసుకెళ్లేవారు. అలా రమస్సెరీ ఇడ్లీ పాపులర్ అయ్యింది.

కుటుంబ వ్యాపారం: రమస్సెరీకి దగ్గర్లో ఉన్న గ్రామంలో నివసించే 60 ఏళ్ల దేవి ఉదయం 6 గం. నుంచి ఇడ్లీలు వండటం మొదలుపెడుతుంది. మధ్యాహ్నానికల్లా పని పూర్తి చేసుకుంటుంది. రోజుకు సుమారుగా 500 వందల ఇడ్లీలు చేస్తుంది. ముందుగా ఒక అల్యూమినియం పాట్‌లో నీళ్లు నింపి దాన్ని పొయ్యిపై పెట్టి మూతపెడుతుంది. మరో పాత్రను కూడా పొయ్యిపై పెడుతుంది. ఒక అరటి ఆకు తీసుకుని, ఇడ్లీ పిండిని దానిపై వేసి దాన్ని ఆవిరి అవుతున్న కుండలో ఉంచుతుంది. 5 నిముషాల్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది. అరటి ఆకు గుర్తులు ఇడ్లీపై పడి చూడటానికి భలే ముచ్చటగా ఉంటుంది. ఇడ్లీలోకి ఉల్లి మసాలా చెట్నీ ( సాంబార్‌లోకి ఉపయోగించే చిన్న చిన్న ఉల్లిపాయలతో చేసేది), కొబ్బరి చట్నీ, పొడులతో తింటే స్వర్గం కనిపించాల్సిందే. రెండు ఇడ్లీలుండే ప్లేటు ఇడ్లీ తింటే చాలు కడుపునిండిపోతుంది.

అరుణ్‌కుమార్ అనే వ్యాపారస్తుడు మాట్లాడుతూ మేం తయారుచేసిన ఇడ్లీలను పాలక్కాడ్‌లోని హోటల్స్, బేకరీస్‌లకు సరఫరా చేస్తుంటాను. చిత్తూరులోనూ మా కస్టమర్లున్నారు. నా అన్న రవీంద్రన్ కూడా ఇదే బిజినెస్ చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. ఇడ్లీ పిండిని ఏడు గంటల పాటు పులియబెడతాం. అందరిలాగానే బియ్యం, మినపప్పు మాత్రమే కలిపి పిండిని తయారుచేస్తాం. చాలా చోట్ల నుంచి ప్రజలు వచ్చి మా తయారీ విధానాన్ని అడుగుతుంటుంటారు.

ట్రై చేశాం బాగా రాలేదని చెప్తుంటారు. ఇదంతా చేసే ఇక్కడి వాళ్ల చెయ్యి, గాలి,నీళ్ల మహిమే అని మా నమ్మకం. 700-1000 వరకు ఇడ్లీలను తయారుచేసి 6 ఇడ్లీలతో కూడిన పేకింగ్ చేసి రు. 30లకు అమ్ముతుంటాం. పిల్లలు బయట ఇండినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌చదువుతున్నారు. వాళ్లకు ఈ బిజినెస్‌పై ఆసక్తి లేదు. మా సంప్రదాయాన్ని ఎలా కాపాడుకోవాలో అర్థంకావట్లే దని బెంగపడుతుంటాడు.

త్రిస్సూర్ నుంచి వచ్చిన ఒక వ్యాపారవేత్త రోజుకు 5000 ఇడ్లీలను తయారుచేసి ఇవ్వమని వీరందరికీ ఓ ఆఫర్‌ను ఇచ్చాడు. అంటే ప్రతి కుటుంబం వెయ్యి ఇడ్లీలు చేయాలన్నమాట. ఇడ్లీకి రూ. 5 చొప్పున ఇస్తానన్నాడట. అతడు వాటిని కేరళ, కొచ్చిన్, త్రిస్సూర్‌లో అమ్మకాలు చేసి, కేరళ రాష్ట్రానికి మెయిన్ సప్లయిర్‌గా ఉంటానన్నాడని ఇక్కడివాళు చెబుతున్నారు. మేమైతే ఏం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మా భవిష్యత్ ఏంటో ఇంకా తెలియదు. 200ఏళ్ల చరిత్ర ఉన్న మా వ్యాపారాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్నది కాలమే నిర్ణయిస్తుందంటున్నారు ఇడ్లీ వ్యాపారస్తులు.

Comments

comments