Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

అభివృద్ధి కనబడదా?

speak

* విపక్షాల కుట్రలను తిప్పికొట్టడానికి ప్రజలు సిద్దమయ్యారు
* మేడిగడ్డయే సూర్యాపేట జిల్లాకు జీవనాధారం
* సూర్యాపేట జిల్లాలో మంత్రి సుడిగాలి పర్యటనలో సుమారు 750మంది టిఆర్‌ఎస్‌లో చేరిక

మన తెలంగాణ/సూర్యాపేట : అభివృద్ధిలో జిల్లా దూసుకుపోతున్న తరుణంలో విపక్షాలు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అ న్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారని ఉద్ఘాటించారు. గతం లో సై అంటే సై అంటున్న నాలుగు పార్టీల నేతలు నేడు ఏకమై ఘర్షణలను ప్రేరేపిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. సిఎం కేసిఆర్ చే స్తున్న అభివృద్ధిని చూసే నాయ కు లు, కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తు న్నా రని చెప్పారు. దీనిని చూసి జీర్ణించుకోలేని విపక్ష నాయకులు అవాక్కు, చవాక్కులు విసురుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైన సూర్యాపేట జిల్లాకు జీవనాధారం మేడిగడ్డేనని అన్నారు. దీనిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు తీవ్రంగా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజకీయాలక తీతంగా అభివృద్ధిలో కలిసి రావాలే కాని ప్రజల సంక్షేమాన్ని అడ్డుకుంటే కాలగర్భంలోనే కలిసిపోతారని పేర్కొన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్‌న గర్‌లో 500 మంది, సూర్యాపేట మండలంలోని బాలెంల గ్రామా నికి చెందిన టిడిపి, కాంగ్రెస్ పార్టీల నుండి సుమారు 50 మంది పార్టీలో చేరారు. చివ్వెంల మండలంలో దురాజ్‌పల్లి, వస్త్రాంతండాల గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు నాయకులు సుమారు 200 మంది టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డారు. మూసినది ప్రాజెక్ట్ కింద మూడు పంటలకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్దం చేసినట్లు చెప్పారు. ఇందులో భాగం గానే కాలువల మరమ్మతులకు రూ.65కోట్లు మం జూరు చేసిన విష యాన్ని గుర్తు చేశారు. గ్రామ పంచాయితీలు, తం డాల రోడ్ల నిర్మా ణానికి రూ.25కోట్లతో అభివృద్ధిలో ముందుకు వె ళ్తుంటే ప్రతిపక్షాల కు కనిపించుట లేదా అని ప్రశ్నించారు.

Comments

comments