Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

కుభీర్‌లోని కస్తూర్భా విద్యార్థినుల తిప్పలు

school

= సరఫరా అవుతున్న సరుకులకు రిజిస్టర్‌లో నమోదు శూన్యం
= నిధులు విడుదలైనా విద్యార్థినులకు అందని సౌకర్యాలు
= గుడ్లు పెట్టరు…. కాస్మోటిక్ డబ్బులు ఇవ్వరూ…
= ప్రతి నిత్యం ఏదో ఒక సమస్య… నామమాత్రపు తనిఖీలు

మనతెలంగాణ/కుభీర్: మండలంలోని కస్తూర్భా గాంధీ ప్రిన్సిపాల్ మెనూ పాటించని భోజనం పెడుతున్నట్లు అధికారుల విచారణలోనే బయట పడింది. కాస్మోటిక్ బిల్లులు చెల్లించాలని పైఅధికారులు ప్రిన్సిపాల్‌కు నిధులు విడుదల చేసినా ఇంతవరకు చెల్లించనట్లు అధికారుల సమీక్షలోనే బయట పడింది. ప్రభుత్వ పరంగా సరఫరా జరిగిన వస్తువులను స్టాక్ రిజిస్టార్‌లో నమోదు చేయక పోవడంపై అధికారులు మండిపడుతు న్నారు. ప్రభుత్వం బాలికల విద్యా వ్యాప్తికి ప్రతీ నెలా కస్తూర్భా పాఠశాలలలో లక్షల రూపాయలను ఖర్చు పెడుతుంది. ప్రభుత్వం ప్రచా రాన్ని నమ్మిన తల్లిదండ్రులు వారి పిల్లలు చదువులు నేర్చు కోవడానికి అన్ని సౌకర్యాలున్న పాఠశా లలో పంపుతుంటే విద్యార్థుల బాగోగులను పట్టించుకోని అధికారులు పని తీరువల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ఇక్కడ 175 మంది బాలికలు చదువుకోవాల్సి ఉండగా రోజుకు పదుల సంఖ్యలో విద్యార్థులు గైర్హాజరు నమోదు ఉంటుంది. అధి కారుల విచారణలోనే ఎన్నో అక్రమాలు బయటపడితే, ప్రతినిత్యం వసతి గృహంలో ఏదో సమ స్యతో ఇబ్బందులు పడుతూనే ఉంటారని ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన ప్రిన్సిపాల్‌పై సంబంధిత శాఖ అధి కారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ప్రిన్సిపాల్ నిర్లక్షం వల్లే తాగునీటికి కష్టాలు: బంక బాబు (కాంగ్రెస్ నేత)
వసతి గృహంలో 175 మంది ఉండాల్సి వస్తుంది. వీరందరికి మంచినీటి సౌకర్యం కల్పించాలి కాని నీటిని సరఫరా ట్యాంకు పగిలి పోయి రోజులు గడుస్తుంది. కరెంటు ఉంటేనే తాగు నీరు, లేకుంటే లేదన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రిన్సిపాల్ నిర్లక్షంగా వ్యవహరించడం వల్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి: గజేందర్ (ఎంఆర్‌పిఎస్ నాయకుడు)
కాస్మోటిక్ బిల్లులను ఉన్నతాధికారులు ఆగస్టు నెలలో విడుదల చేసినట్లు చెబుతున్నారు.ప్రిన్సిపాల్ వైఖరి మాత్రం చెల్లించకుండా సొంతాని వాడుకున్నారు. విద్యార్థులు ఇబ్బందులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. మెను ప్రకారంగా భోజనం పెట్టక నెలకు ఒకసారి గుడ్డును పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

comments