Search
Thursday 22 March 2018
  • :
  • :
Latest News

జనగామలో బతుకమ్మకుంట ఆక్రమణలు నిజమే

assembly

తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ
కబ్జాలపై కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌ల మధ్య గరంగరం
లెక్కలు తీద్దామని తలసాని సవాల్

మన తెలంగాణ/హైదరాబాద్ : జనగామలో ఎంఎల్‌ఏ భూ కబ్జా వ్యవ హారం శాసనమండలిలో దుమారం రేపింది. ఈ అంశంపై అధికార ప్రతి పక్ష సభ్యులు పరస్పరం తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసు కున్నారు.ప్రశ్నోత్తరాల సమయంలో జనగామలోని బతుకమ్మ కుంట చెరువు ఆక్రమణపై కాంగ్రెస్ ఎంఎల్‌సి పొంగులేటి సుధాకర్ రెడ్డి అడి గారు. జనగామ పట్టణంలో చెరువు ఆక్రమణలకు సంబంధించి స్థానిక ఎంఎల్‌ఎ కన్నుసన్నల్లోనే జరిగిందని జిల్లా కలెక్టర్ స్వయంగా పేర్కొ నడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ వ్యవ హారంపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశా రు. దీనిపై ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ సమాధానమిస్తూ ఈ ఘటనకు సంబంధించి కొంత ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమేనని, వీటిని తొలగించడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దీనిపై పొంగులేటి ఏదో మాట్లాడబో తుండగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జోక్యం చేసుకొని గత 40 ఏళ్లపాటు పాలించిన కాం గ్రెస్ నాయకులు ఎక్కడెక్కడ ఆక్రమణలకు పాల్పడ్డారో అందరికీ తెలుసునని, వాటి లెక్క లు తీద్దామా అన్ని సవాల్ విసిరారు.దీంతో ప్రతిపక్షనాయకులు మహ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖమంత్రి సభలో ఉండగా ఇతర శాఖ మంత్రి మాట్లా డడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో మహమూద్ అలీ మాట్లాడుతూ చెరువు స్థలంలో కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు చేపడు తున్నారు. ఆ వెంటనే ఛైర్మన్ కె.స్వామి గౌడ్ ప్రశ్నోత్తరాల సమయం ముగిసినట్లుగా ప్రకటించారు. అధికార పక్ష సభ్యులు సభను బుల్‌డోజ్ చేస్తూ తమ హక్కులకు భంగం కలిస్తున్నారని, నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు షబ్బీర్ అలీ ప్రకటించి సభ నుంచి నిష్క్రమించారు.

Comments

comments