Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

భారత నిపుణులే మాకు స్ఫూర్తి: ఇవాంక

IVANKA

హైదరాబాద్: ఇన్నోవేషన్ హబ్ గా ఎదుగుతున్న హైదరాబాద్ లో గ్లోబల్ ఎంటర్ప్రీన్యూర్ సమ్మిట్ (జిఇఎస్)లో పాల్గొనడం సంతోషంగావుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ అన్నారు. భారత్ మా నిజమైన స్నేహితుడని మా ప్రెసిడెంట్ ట్రంప్ చెబుతారు. వైట్ హౌస్ కు ఇండియా అత్యంత సన్నిహిత దేశమని ఇవాంక చెప్పారు. భారత్ కు ఎంతో చరిత్ర, ప్రాశస్త్యం ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ను ముత్యాల నగరం అంటూ కొనియాడారు. ఈ నగరానికి యువతే గొప్ప సంపదని, ఇక్కడి పారిశ్రామిక వేత్తలు సరికొత్త విప్లవం సృష్టిస్తున్నారన్నారు.
రాత్రింబవళ్లు కష్టపడుతూ యాప్ లు, రోబోలు రూపొందిస్తున్నారని కొనియాడారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఐటి ఇంక్యూబెటర్ గా హైదరాబాద్ టీహబ్ తయారు కావడం గొప్ప విషయం అన్నారు.
ఈ సమ్మిట్ లో 52 దేశాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొనడం చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. ‘‘ ఓ పారిశ్రామికవేత్తగా మహిళ ఎదగాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు.. మహిళలు మరింత కష్టపడాలని తెలుసుకున్నా ’అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. పురుషాధిక్య సమాజంలో స్త్రీలు రాణించడం గొప్ప విషయం. ప్రత్యేకంగా మహిళ పారిశ్రామికవేత్తలను అభినందిస్తున్నాను. గత దశాబ్ధ కాలంలో మహిళా పారిశ్రామికవేత్తలు సంఖ్య 10శాతానికి పెరగడం విశేషం అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. కష్టపడితే మహిళలు వారి భావిష్యత్తును వారే తీర్చిదిద్దుకోగలరిని సూచించారు.

గత పదేళ్ళలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పది శాతం పెరిగిందని చెప్పారు. సాంకేతికతతోపాటు రుచికరమైన బిర్యానీకి ఇండియా అడ్డా అన్నారు. 350మంది అమెరికా ఎంటర్ ప్రీనియర్స్ ను మీకు పరిచయం చేయబోతున్నానన్నారు.. మైక్రోసాఫ్ట్ సిఈవో సత్యనాదెళ్ల హైదరాబాద్ వ్యక్తే అని గుర్తు చేశారు. ఇండియా నిపుణులు తమకు స్ఫూర్తిదాయకులని, ఛాయ్ అమ్మే స్థాయి నుండి ప్రధాని కాగలగడం మీ ప్రధాన మంత్రి గొప్పతనమని కొనియాడారు.

Indian experts are inspiring to us: IvanKa Trump

Comments

comments