Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

రన్‌వేపైకి అడవి పంది…

Indigo-Flight-at-Vizag-Airp

విశాఖపట్నం: విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఉన్నటుండి రన్‌వేపైకి అడవిపంది దూసుకొచ్చి, విమానం చక్రాన్ని ఢీకొట్టింది. పైలెట్ చాకచక్యంగా వ్యవహారించడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన వైజాగ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇండిగో సంస్థకు చెందిన విమానం ఆదివారం రాత్రి 10 గంటలకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ల్లాల్సి ఉంది. అయితే విమానం టేకాఫ్ అవుతుండగా హఠాత్తుగా అడవిపంది రన్‌వేపై దూసుకొచ్చి విమానం చక్రాన్ని ఢీకొట్టింది. దాంతో అప్రమత్తమైన పైలెట్ ఫ్లైట్‌ను పరిసర ప్రాంతాల్లో గంటపాటు చక్కర్లు కొట్టించి తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టులోనే లాండ్ చేశాడు. అనంతరం మరమ్మతులు నిర్వహించి అర్ధరాత్రి తరువాత విమానం హైదరాబాద్‌కు బయల్దేరింది.

IndiGo flight hits wild boar at Visakhapatnam Airport.

Comments

comments