Search
Wednesday 22 November 2017
  • :
  • :

లాభాల స్వీకరణకే మొగ్గు

 అమ్మకాల ఒత్తిడితో నష్టపోయిన మార్కెట్ సూచీలు
 281 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

Stock-Exchangeన్యూఢిల్లీ : రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. సోమవారం స్టాక్‌మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అదానీ పోర్ట్, కోల్ ఇండియా, ఎల్ అండ్ టి, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్ సూచీలు పతనమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 281 పాయింట్లు పడిపోయి 33,033 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 97 పాయింట్లు పడిపోయి 10,225 పాయింట్ల వద్ద స్థిరపడింది. చివరి గంటల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఎన్‌ఎస్‌ఇలో టిసిఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్‌ఫార్మా, యుపిఎల్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. అదానీ పోర్ట్, అరబిందో ఫార్మా, ఒఎన్‌జిసి, కోల్‌ఇండియా, భారతీ ఇన్‌ఫ్రాటెల్ షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ ఐటి సెక్టార్ సూచి మాత్రమే 0.12 శాతం లాభపడగా, మిగతా అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. కీలకమైన నిఫ్టీ బ్యాంక్ 0.55 శాతం నష్టపోయి 25,358.30 వద్ద ముగిసింది. నిఫ్టీ మెటల్ సూచి అత్యధికంగా 2 శాతం నష్టపోయింది. అత్యధికంగా టెలికాం సూచీ 1.94 శాతం నష్టపోయింది. టీసీఎస్ అత్యధికంగా 1.76 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 4.62 శాతం, సన్‌ఫార్మా 1.14 శాతం లాభపడ్డాయి. అదానీ పోర్ట్ అత్యధికంగా 4.49 శాతం, అరబిందో ఫార్మా 4.32 శాతం, ఒఎన్‌జిసి 3.59 శాతం నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఇలో మెటల్ అత్యధికంగా 2 శాతం పతనమైంది. రియల్టీ, ఎఫ్‌ఎంసిజి, ఫార్మా, నిఫ్టీ బ్యాంక్, ఆటో 1.4- 0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. మరోవైపు రిలయన్స్ కమ్యూనికేషన్ త్రైమాసిక ఫలితాల్లో భారీగా నష్టాలను నమోదు చేయడంతో షేరు విలువ 14 శాతం పడిపోయింది.
బలహీనపడిన చిన్న షేర్లు
మార్కెట్లు పతనం దిశగా పయనిస్తుండడంతో చిన్న షేర్లు కూడా డీలాపడ్డాయి. బిఎస్‌ఇలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పడిపోయింది. మొత్తం షేర్లలో 1,629 నష్టపోగా 1,083 లాభపడ్డాయి.
ఫండ్స్ కొనుగోళ్లు
గత వారం బుధ, గురువారాల్లో విదేశీ పోర్ట్‌ఫోలియె ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) రూ. 4,300 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు. నగదు విభాగంలో శుక్రవారం రూ. 529 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు బుధ, గురువారాల్లో రూ. 3,200 కోట్లను ఇన్వెస్ట్ చేసిన దేశీ ఫండ్స్(డిఐఐలు) శుక్రవారం మరోసారి దాదాపు రూ. 1921 కోట్ల విలువైన స్టాక్స్‌ను కొనుగోలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

Comments

comments