Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

తుప్రాన్‌లో యువతి అదృశ్యం

Girl-Missing

మెదక్: జిల్లా తుప్రాన్ మండలం ఇస్లాంపూర్ తండాకు చెందిన ఓ యువతి అదృశ్యమైంది. శనివారం స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్థానికంగా ఉండే రవీందర్ నాయక్ పెద్ద కూతురైన సోని(16) తుప్రాన్‌లోని చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే, శనివారం ఉదయం తండాకు చెందిన స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లిన సోని రాత్రి వరకు కూడా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిన సోని తల్లిదండ్రులు ఆమెతో పాటు మూవీకి వెళ్లిన స్నేహితుల వద్ద వాకాబు చేయగా, సినిమా మధ్యలోనే థియేటర్ నుంచి సోని బయటకు వెళ్లిపోయినట్లు తెలిపారు. దాంతో సోని తల్లిదండ్రులు ఆమె స్నేహితులు, బంధువులు వద్ద వెతికారు. కాని ఎక్కడ సోని ఆచూకీ దొరకలేదు. అనంతరం ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Intermediate Girl Missing in Toopran.

Comments

comments