Search
Wednesday 22 November 2017
  • :
  • :

అందులో ఉన్న ఆనందం ఎక్కడా ఉండదు

మూడు తరాల మధ్య ప్రేమ, ఆప్యాయతల్ని చక్కగా చూపిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’. ఈ సినిమాతో కార్తికేయ, సిమ్రాత్‌లు హీరోహీరోయిన్లుగా పరిచయమవుతుండగా గొల్లపూడి మారుతిరావు ముఖ్య పాత్రలో నటించారు. రిషిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రవీందర్ ఆర్.గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా సీనియర్ నటుడు గొల్లపూడి మారుతిరావు చెప్పిన విశేషాలు…
Gollapudi

మూడు తరాల ప్రేమ, ఆప్యాయతలు…
మూడు తరాల మధ్య ప్రేమ, ఆప్యాయతలు, అనుబంధాలను చక్కగా చూపిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’. ఈ చిత్రంలో నేను ముఖ్య పాత్రలో నటించాను. కుటుంబ కథలు తగ్గతున్న నేపథ్యంలో వస్తున్న మంచి చిత్రమిది.
కొత్త అనుభూతిని కలిగించే…
ఈమధ్య కథ చెప్పకుండానే సినిమాలు వస్తున్నాయి. కానీ ఈ సినిమాలో కుటుంబ విలువలు, అనుబంధాలు, ఆత్మీయతలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కించారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే చిత్రమిది.
తాతగా నటించా…
అమెరికాలో మంచి ఉద్యోగం చేసి బాగా సంపాదించిన తర్వాత జీవితం చివరలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో వెలితి కనిపిస్తుంది. కానీ ప్రేమ, ఆప్యాయతలు, మనుషుల పలకరింపుల, ఒకరికొకరు సాయం చేసుకోవడం… ఇదీ జీవితం అంటే. అందులో ఉన్న ఆనందం ఎక్కడా ఉండదు. ఇటువంటి మంచి కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నేను తాతగా నటించాను.
మూడు తరాల శైలి, ఆలోచన ధృకృథాలు…
ఓ కుటుంబ వాతావరణాన్ని నేపథ్యంగా తీసుకొని తీసిన సినిమానే ‘ప్రేమతో మీ కార్తీక్’. ఇందులో ఒక తాత, ఒక తండ్రి, ఒక కొడుకు ఉన్నాడు. మూడు తరాల శైలి, ఆలోచనా ధృకృథాలు తెరపై ఆవిష్కృతమవుతాయి.
ఎక్కువగా ఇష్టపడతారు…
కథా బలం, మంచి కథనం ఉన్న చిత్రాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. ఈవిధంగా వచ్చిన ‘శతమానం భవతి’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మంచి కథతో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

Comments

comments