Search
Wednesday 22 November 2017
  • :
  • :

పోలీస్ వ్యవస్థపై గౌరవం పెరిగింది

కార్తి, రకుల్‌ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా వినోద్ దర్శకత్వంలో ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్‌గుప్తా తొలిసారిగా చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం ‘ఖాకి’. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కార్తీతో ఇంటర్వూ…
Karthi

యదార్థ సంఘటన ఆధారంగా…
దర్శకుడు వినోద్ నాకు ఈ స్క్రిప్ట్ చెప్పగానే ఎంతగానో నచ్చింది. 90వ దశకంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. కొన్ని సన్నివేశాలను ఉన్నవి ఉన్నట్లుగా ఈ సినిమాలో చూపించడం జరిగింది.
నాలుగు గంటలు చర్చించాను…
ఈ సినిమా కోసం తమిళనాడులోని ఒక పోలీస్ అధికారిని కలిసి దాదాపు నాలుగు గంటల పాటు చర్చించాను. ఆ అధికారే మేము సినిమాలో చెప్పబోయే పాయింట్‌ను నిజ జీవితంలో దర్యాప్తు చేశారు. అతని ద్వారా ఈ కేసుకు సంబంధించిన నిజాలను తెలుసుకోవడం జరిగింది.
ఎక్కువ మర్యాద ఇస్తున్నా…
ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు పోలీస్ వ్యవస్థపై గౌరవం పెరిగింది. కొన్ని సీరియస్ కేసుల్ని వారు ఎలా డీల్ చేస్తారోనని అనిపించింది. ఇప్పుడు బయట పోలీస్ కనిపిస్తే మునుపటికంటే ఎక్కువ మర్యాద ఇస్తున్నాను.
ఆమెకు ఇదే మొదటిసారి…
ఇందులో నాకు భార్యగా రకుల్‌ప్రీత్ సింగ్ నటించింది. ఆమెకు ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటిసారి. సినిమా మొత్తం సీరియస్ మూడ్‌లో వెళ్తుంటే ఆమె పాత్ర మాత్రం చాలా సరదాగా ఉంటుంది.
డిఎస్‌పి పాత్రలో కనిపిస్తా…
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ఖాకి’లో కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో నేను డిఎస్‌పి పాత్రలో కనిపిస్తా. నా క్యారెక్టరైజేషన్ స్టైలిష్‌గా ఉంటుంది.
సీరియస్ ఎమోషన్స్‌తో…
‘సింగం’ సినిమాలో పోలీస్ అధికారి సినిమా పరంగా కనిపిస్తాడు. ‘ఖాకి’లో నా పాత్ర మాత్రం రియలిస్టిక్‌గా ఉంటుంది. సీరియస్ ఎమోషన్స్‌తో కూడిన పాత్ర నాది.
తదుపరి చిత్రాలు…
పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో ఒక సినిమా చేయబోతున్నాను. ఆ సినిమా తర్వాత ఓ లవ్ స్టోరీ మూవీలో నటిస్తా. అందులో కూడా రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేస్తుంది.

Comments

comments