Search
Wednesday 23 May 2018
  • :
  • :

అక్రమ దందాకు అడ్డేది

gas

మహారాష్ట్రకు తరలుతున్న సిలిండర్లు

*ఇష్టరీతిన విక్రయాలు
*కన్నెత్తి చూడని విజిలెన్స్ అధికారులు
*హోటల్స్‌కు ఎలాంటి పత్రాలు లేకున్న సరే

పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, పిట్లం మండలాల నుంచి మన వద్ద నుంచి పలు కంపెనీల గ్యాస్ సిలెండర్లు అక్రమంగా తరలుతున్నాయి. ఏజెన్సీ నిర్వాహకులు దళారులతో మాట్లాడుకుని అక్కడి వానానాల ద్వారానే తరలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.  -మన తెలంగాణ/జుక్కల్: పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు జుక్కల్, బిచ్కు ంద, మద్నూర్, పిట్లం మండలాల నుంచి మన వద్ద నుంచి పలు కంపెనీల గ్యాస్ సిలెండర్లు అక్రమంగా తరలుతున్నాయి. ఏజెన్సీ నిర్వాహకులు దళారులతో మాట్లాడుకుని అక్కడి వాహానాల ద్వారనే తరలించేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. పరిశీలించి చూస్తే నిజంగానే మన సిలెండర్లు జుక్కల్ మండలం నుంచి మహారాష్ట్ర సరిహద్దులైన పెద్ద గుల్లా, చండేగాం ప్రాంతాల మీదుగా తరులుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. నిఘ పెట్టి చూడగ మహారాష్ట్ర హనేగాం వద్ద ఒక ఆటోలో సిలెండర్లు తీసుకుని మర్కెల్ ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అయితే సదరు ఆటో డ్రైవర్‌ను ఎక్కడ్నుంచి తీసుకువెళుతున్నావని అడుగా ఆయన గుటకలు మింగుతూ ఆటో ఆపకుండా వెళ్ళిపోయాడు. దీంతో మహారాష్ట్రకు తరులుతున్న విషయం నిజమేనని నమ్మాల్సి వచ్చింది. ఆటోలో చూస్తే హెచ్‌పి, ఇండెన్ గ్యాస్ సిలెండర్లే ఎనిపించాయి. మద్నూర్ మండలం సరిహద్దుకు అతి దగ్గరుండటంతో అక్కడ్నుంచి కూడ తరలించేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. పిట్లం మండలం నుంచి కర్ణాటక రాష్ట్రం సరిహద్దు కావడంతో ఆ రూటులో కూడ వెళుతుంటాయని ఆరోపిస్తున్నారు. బిచ్కుంద మండలంలో, జుక్కల్ మండలాల్లో గత నాలుగురోజుల క్రితం విజిలెన్స్ అధికారులు వచ్చి ఎలాంటి కేసులు చేయకుండా ఎక్కడ కూడ తనిఖిల్లో యే ఒక్కటి పట్టుకోలేదు. వచ్చి చుట్టపు చూపులాగా వెళ్ళిపోయారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో గత మూడేళ్ళ క్రితం కూడ ఇదే మాదిరిగా పలు అక్రమాలు వెలుగులోకి రావడంతో డిఎస్‌ఒ వచ్చి చేతులు మార్చుకుని వెళ్ళిపోయారు. ఎక్కడ చర్యలు తీసుకోలేదు. బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో గ్యాస్ సిలెండర్లు ఇష్టరీతిన విక్రయించుకుంటున్నారనే విమర్శ చాల చోట్ల వినబడుతుంది. బిచ్కుందలో కొన్ని గ్యాస్ సిలెండర్ల వినియోగదారులు అక్కడే మహిళ సంఘాల ద్వార ఇచ్చేవి తీసుకువస్తున్నారు. అవి పక్క మండలాలకు బదిలి చేయాలని చెప్పిన వినిపించుకోవడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. ధరలు కూడ ఎప్పటికప్పుడు మారుతుండటంతో రెండు నెలల్లో యే ధర ఉం టుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

comments