Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

కేసిఆర్ దీక్షతోనే తెలంగాణ

mp

ఎంపి సీతారాంనాయక్ 

మహబూబాబాద్ టౌన్: ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను తెలంగాణ ప్రజలు చరిత్రలో గుర్తుంచుకోవాలని మహబూబాబాద్ ఎంపి అజ్మీర సీతారాంనాయక్ అన్నారు. బుధవా రం జిల్లా కేంద్రంలో జాగృతి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గునిగంటి కమలాకర్ అధ్యక్షతన స్తానిక టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురు గా దీక్ష దివాస్‌ను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. కేసిఆర్ 14 సంవత్సరాల సుదీర్గ పోరాటంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. అయినా తెలంగాణలో ఇంకా తెలంగాణ ద్రోహులు బ్రతికే ఉన్నారు వారికి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సబ్బండా వర్గాలు కేసిఆర్ వెంట నడిచాయన్నారు. సరైన ఫ్లాట్ ఫా లేకనే రేవంత్ కాంగ్రెస్‌కు చేరారని పేర్కొన్నారు. తాను అర్ధరహితంగా టిఆర్‌ఎస్ పై మాట్లాడటం సరికాదన్నారు. అనేక మంది నాయకులు అమ్ముడుపోయారు. కానీ కేసిఆర్ అమ్ముడుపోలేదని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికి 39పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. కేసిఆర్ కళలు గన్న బంగారు తెలంగాణను సాదించేందుకు కలసి కట్టుగా పనిచేయాలని టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తక్కెళ్ళపల్లి రవీందర్‌రా వు, నూకల నరేష్‌రెడ్డి, సత్యావతి రాథోడ్, మాలోత్ కవితలు అన్నారు. అనంతరం పూలమాలలు వేసి దీక్షలోను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బయ్యారం ఎంపిపి జయశ్రీ, టిఆర్‌ఎస్ నాయకులు బానోత్ రవికుమార్, పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, మార్నేని వెంకన్న, మంగలంపల్లి కన్న,జెర్రిపోతుల వెంకన్న, మల్లెపాక మదు, ఫరీధ్, డోలి లింగుబాబు, అదిల్ ఫాషా తదితరులు పాల్గొన్నారు. కాగా ఈదీక్షలను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య,వెన్నం శ్రీకాంత్ రెడ్డిలు విరమింపజేవారు.

Comments

comments