Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

కేటీఆర్ మనసును దొచుకున్న…‘బుజ్జి’

BABY

హైదరాబాద్: ఓ బుజ్జాయి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మనసు దోచేసుకుంది. నేడు బాలల దినోత్సవం వేడుకలను రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఘనంగా చేసుకున్నారు. పలు పాఠశాలల్లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. అయితే ఓ పాఠశాలలో జరిగిన ఫ్యాన్పీ డ్రెస్ కాంపిటీషన్‌లో పాల్గొన్న బుజ్జి పాప కేటీఆర్ దృష్టిని ఆకర్షించింది. ఐరా అనే రెండేళ్ల చిన్నారి అచ్చం కేటీఆర్‌లాగా దుస్తులు ధరించి పాఠశాల వేడుకల్లో పాల్గొంది. చూడటానికి ఎంతో ముద్దొచ్చేలా ఉన్న ఈ బుజ్జి కేటీఆర్ ఫొటోలను పాప తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్‌కు పంపించారు. ‘నా మనసును ఎంతగానో హత్తుకున్నాయి కృతజ్ఞతలు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Comments

comments