Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

కురుమూర్తి రాయ…గోవిందా..గోవిందా..!

kurumurthy2చిన్నచింతకుంట : తెలంగాణ పల్లె ప్రజలు కొలిచే కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 2వ శనివారం కార్తికమాసం సెలవు దినం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా చుట్టు పక్కల పల్లె ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీ కురుమూర్తి స్వామి కొండలు భక్తులతో రద్దీగా మారాయి. స్వామి వారి ప్రధాన ఆలయం, లక్ష్మీదేవి, ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాలు, ఉద్దాల మండపం భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి మొక్కల్లో భాగంగా మట్టి కుండల్లో పరమాన్నం, పచ్చిపులుసు నైవేద్యాలు, దాసంగాలు స్వామివారికి సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు స్వామి వారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించి కురుమూర్తి స్వామిని కన్నులారా వీక్షించి పునీతులయ్యారు. కొండ దిగువన ప్రధాన ముఖ ద్వారా నుంచి స్వామి వారి సన్నిధి వరకు ప్రధాన మెట్లను భక్తులు దర్శించుకుంటున్నారు. జాతర మైదానంలో వెలసిన దుకాణ సముదాయాల్లో భక్తులకు కావల్సిన తినుబండారాలు, వంట సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు. పెద్దలు, పిల్లలు రంగుల రాట్నాలు, బ్రేక్‌డాన్స్‌లు, చిన్నిపిల్లల బోటు,జంపింగ్, హంస రైళ్లులతో పిల్లల సందడి నెలకొంది. జాతరలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఎస్‌ఐ సతీష్ నిర్వహిస్తున్నారు.  భక్తులకు జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ సురేందర్‌రెడ్డి, కార్యనిర్వహణాధికారి గురురాజలు తెలిపారు.

Comments

comments