Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

మేకలపై చిరుతపులి దాడి

chita-image

భయాందోళనలో అటవీప్రాంత జనాలు

మన తెలంగాణ/నవాబ్‌పేట్ : మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండల పరిధిలోని ఫత్తేపూర్ మైసమ్మ అడవిలో చిరుతపులుల దాడులు తీవ్రతరమయ్యాయి. గతంలో రాత్రి సమయాల్లో అడవికి సమీపంలో వున్న వ్యవసాయ పొలాల్లో పశువులను వేటాడే చిరుతపులులు ప్రస్తుతం యధేచ్చగా గ్రామ పరిసరాలలోకి వచ్చి మూగజీవాలను జనాల సాక్షిగా చంపితింటూ వుండడంతో అటవీ ప్రభావిత గ్రామాల ప్రజలు దినదిన గండంగా భిక్కుభిక్కుమంటూ గడుపుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం చాకల్‌పల్లి గ్రామ సమీపంలో తెల్లవారు జామున చిరుత సంచరించి లేగదూడను చంపితిన్న సంఘటన మరవక ముందే శనివారం ఉదయం మరో భయానక సంఘటన చోటుచేసుకుంది. చాకల్‌పల్లి గ్రామ పంచాయితీ అనుబంధ గ్రామమైన నీర్‌సాబ్ తాండాకు చెందిన పాండునాయక్ అనే రైతు ఉదయం దాదాపు 11గంటలకు తన మేకలను మేతకై తీసుకెళ్తూ వుండగా గ్రామశివారు దాటకముందే చిరుతపులి మేకలమందపై దాడిచేసిమేకను నోట్లో కరుచుకొని చెట్లపొదల్లో లాక్కెళ్లిపోయింది. గతంలో కన్న అటవీ ప్రాంత గ్రామాల్లో ప్రస్తుతం చిరుతల దాడులు అధికమవడంతో చాకల్‌పల్లి, మేగ్యానాయక్ తాండా, నీర్‌సాబ్ తాండా, మొగుళ్లపల్లి, వీరశెట్టిపల్లి తదితర గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందిం చి గ్రామాల మధ్యలో ఔట్‌పోస్టులను ఏర్పాటుచేసి ‚చిరుత దాడులనుండి రక్షణ కల్పించాలని జనాలు కోరుతున్నారు.

Comments

comments