Search
Monday 11 December 2017
  • :
  • :

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

school

* మునుగోడు శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

మన తెలంగాణ/చౌటుప్పల్ : గ్రంథాలయాలు ప్రతి ఒక్కరికీ మనో వికాసాన్ని కలిగించే విజ్ఞాన భాండాగారాలని మునుగోడు శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ గ్రంథాలయంలో సోమవారం నిర్వహించిన ముగింపు వారోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా విజ్ఞాన సముపార్జనతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. చదువుకు వయసుతో పని లేదన్నారు. దేవాలయాలతో సమానమైన గ్రంథాలయాలలో సాహిత్య, సంస్కృతిక పోటీలు నిర్వహించడం ఈ ప్రాంతవాసులకు సాహిత్యాన్ని మరిం త దగ్గర చేసినట్లవుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో నేటి నిరుద్యోగ యువతకు అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులోకి తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పుస్తకం ప్రతి ఒక్కరికీ మంచి నేస్తమన్నారు. గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన, పాటల పోటీలు, ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ పాక పద్మ, ముటుకుల్లోజు దయాకరాచారి, నందగిరి శ్యామ్, కృష్ణ, బడగు శ్రీరాములు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఊడుగు మల్లేష్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments