Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

గ్రంథాలయాలే జ్ఞాన నిలయాలు

speak

*గ్రంథాలయాల్లో మౌలిక సదుపాయాలకు కృషి
*గ్రామ గ్రామంలో గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు

*విజ్ఞానం కొరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి పుస్తకాలు
*జిల్లా గ్రంథాలయ చైర్మన్ దొంతి చంద్రాగౌడ్

మనతెలంగాణ/మెదక్ టౌన్ : గ్రంథాలయాలంటే సరస్వతీ నిలయాలని, ఏదోరకంగా డబ్బును సంపాదించుకోవడం సాధ్యం కావొచ్చు కానీ జ్ఞానాన్ని, విద్యను సంపాదించుకోవడం అంత సులభతరం కాదని జిల్లా గ్రంథాలయ చైర్మన్ దొంతి చంద్రాగౌడ్ అన్నారు. మంగళవారం నాడు మెదక్ జిల్లాలోని 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా గ్రంథాలయంలో జ్యోతిప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వాతంత్య్ర పోరాటంలో ప్రధానమైన భూమికను గ్రంథాలయాలు పోషించాయని, స్వాతంత్య్రానికి పూర్వం కూడా పత్రికల ద్వారానే విద్యావంతులు చదివి ప్రజలకు సమాచారాన్ని అందించేవారన్నారు. ఈ కాలంలో సరస్వతి ఉంటేనే లక్ష్మి వరిస్తుందని, చదువుకు ఉన్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. జిల్లా కేంద్ర నూతన గ్రంథాలయ భవనానికి ఎకరం భూమితోపాటు మౌలిక సదుపాయలను కల్పించవల్సిందిగా మున్సిపల్ చైర్మన్‌ను కోరగా అందుకు ఆయన స్పంది స్తూ.. త్వరలోనే ఒక ప్రదేశాన్ని ఎంపికచేసి చూపిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయాలకు మౌలిక సదుపాయల కోసం 50వేల రూపాయలను ప్రకటించారు. గ్రంథాలయంలో పాఠకులకు, విద్యార్థులకు పుస్తకాల కొరత ఉంటే తన దృష్టికి తీసువస్తే వెంటనే అందుబాటులోకి తెచ్చేవిధంగా కృషిచేస్తానన్నారు. జిల్లాలోని గల మొత్తం 16 గ్రంథాలయాలను పూర్తి స్థాయిలో పాఠకులకు అందుబాటులోకి తెచ్చేవిధంగా చర్యలు చేపడుతామన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ మాట్లాడుతూ… తామ విద్యార్థి దశలో గ్రంథాలయాలే కీలకంగా ఉండేవని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అభివృద్ధిని, పరిణామాలను కేవలం గ్రంథాలయాలలో ఉన్న పత్రికల ద్వారానే తెలుసుకునే వారమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్లు అనుషఅరవింద్‌గౌడ్, కళ్లెంపేట యాదగిరిగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు సోహెల్, అయితారం నర్సింలు, వాసవిక్లబ్ అధ్యక్షులు గంజి శ్రీనివాస్, వనితక్లబ్  అధ్యక్షురాలు రాగి వనజ, మశ్చేంద్రనాథ్, రామారావు, నందరాం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments