Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

రుణాలు మంజూరు చేయాలి

SBI

జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ ఎం జ్యోతి 

మన తెలంగాణ/ఆదిలాబాద్ టౌన్ : మహిళ సంఘాలకు, అ ల్పాదాయ వర్గాల నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు బ్యాం కులు అదేవిధంగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ అన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు, గ్రూపులు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే సంఘాలకు ఎక్కువ రుణాలు ఇవ్వాలన్నారు. గ్రేడింగుల ప్రకారం గతంలో తీసుకుని తిరిగి చెల్లించిన వారిని గుర్తించి ఎక్కువ రుణాలు మంజూరు చేయడం ద్వారా సంఘాలు రుణాలు తిరిగి చెల్లించి ఎక్కువ రుణాలు పొందే ఆస్కారం ఉంటుందని అభిప్రాయ పడ్డారు. అలాగే రైతులకు ఈ ఖరీఫ్ సీజన్‌లో 91 శా తం పంటరుణాలు అందించడం జరిగిందన్నారు. గత నెల వరకు 99,117 మంది రైతు ఖాతాదారులకు 95,082 లక్షల పంట రుణాలు వివిధ బ్యాంకుల ద్వారా అందించడం జిరిగిందని వివరించారు. జిల్లాలో ముద్ర రుణాలను అందించడం జ రుగుతున్నదని, శిశురుణం క్రింద 821 మందికి 392 లక్షలు కిశోర రుణం క్రింద 526లక్షలు, తరుణ్ రుణం క్రింద 202 లక్షల పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ప్రతి బ్యాంకు బ్రాంచి నుంచి 5 నుంచి 10 మందికి ముద్ర రుణాలు మంజూరు చేయాలని ఈ రుణాలు చెల్లించిన వారికి మరిన్ని రుణాలు అందించాలని సూచించారు. బ్యాంకుల్లోని గల 9,85,167 సేవింగ్, కరంటు ఖాతాలు ఉండగా , ఇప్పటి వరకు 5,96,347 ఖాతాలకు మొబైల్ నెంబర్ సేడింగ్, 720015 ఆధార్‌సేడింగ్ చేయడం జరిగిందన్నారు. మిగలిన ఖాతాలకు వెంటనే సీడింగ్ చేయడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల యూనిట్లను వెంటనే సీండింగ్ చేయాలని కంట్రోలింగ్ బ్యాంకు అధికారులు మానిటరింగ్ చేయాలన్నారు. ప్రతి మూడు వారాలకు ఒక సారి కంట్రోలింగ్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎల్‌డిఎం ప్రసాద్‌కు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖల ద్వారా మంజూరైన యూనిట్లు, సేండింగ్ చేసిన యూనిట్లపై బ్యాంకుల వారీగా సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో నాబార్డ్ ఎజీఎం పురోహిత్, ఆర్‌బిఐ ప్రతినిధి అనిల్‌కతబూరే, డిఆర్‌వో శంకర్, ఆర్‌డివో సూర్యనారాయణ, జడ్జీసిఈవో జితేందర్‌రెడ్డి, పిడి డిఆర్‌డివో రాథోడ్ రాజేశ్వర్, వివిధ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments