Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

లారీ ఢీకోని ఒకరు మృతి, మరోకరికి తీవ్రగాయాలు

body

మనతెలంగాణ/మంగపేట:

మండలంలోని పాలాయి గూడెం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ కంటైనర్ ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన సోమవారం జరిగింది. మంగపేట ఎస్సై అరకూటి మహేందర్ యాదవ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి….మంగపేట మండల కేంద్రం నుంచి రాజుపేట పని నిమిత్తం తన ఎంహెచ్ 30 డబ్లు 6588 నంబర్‌గల ద్విచక్రవాహనంపై హర్షవర్తన్‌రెడ్డి, కిరణ్‌లు వెళుతున్నారు. రాజుపేట నుంచి మంగపేట వైపు వస్తున్న హెచ్‌ఆర్ 4 టీసీ5634 నంబర్‌గల కంటైనర్ వాడగూడెం పంచాయితీ పరిధిలోని పాలాయి గూడెం సమీపంలో ఎదురుగా ఢీకోట్టింది. దీంతో హర్షవర్దన్‌రెడ్డి, కిరణ్‌కు తీవ్రగాయాలు కాగా ఇరువురుని 108లో ఏటూరు నాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఇరువురి పరిస్తితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా హర్షవర్దన్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దార్యాప్తు చేస్తున్నారు.

Comments

comments