Search
Monday 11 December 2017
  • :
  • :

బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా మహబూబాబాద్

talk

మన తెలం గాణ/మహబూబాబాద్ ప్రతినిధి:
స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 2018 అక్టోబర్ నాటికి మహబూబాబాద్ జిల్లాను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా దిశానిర్ధేశం చేశారు. సోమవారం వివిధ శాఖల జిల్లా అధికారులతో యుద్ధప్రాతిపదికన ఒడిఎఫ్ నిర్మాణాలు చేపట్టాలని కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరంగా 24శాతం మాత్రమే ఒడిఎఫ్ సాధించామని, 76శాతం సాధించాలంటే గ్రామ, మండల స్థాయిలో ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళాలని, జిల్లాలో ఒడిఎఫ్‌పై ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటలకు రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అధునాతన పద్ధతుల్లో నిర్మించుకునేలా చూడాలన్నారు. కాంట్రాక్టర్స్ పద్దతుల్లో నిర్మాణాలు చేస్తేనే లక్షం సులువుగా చేరుకోవచ్చన్నారు. ప్రతీ మండలానికీ ఇప్పటికే రూ.10లక్షలు ఒడిఎఫ్ నిర్మాణాల కోసం ఇచ్చినట్లు, ఎస్‌బిఎం(ఒడిఎఫ్) ప్రచారం నిమిత్తం ప్రతి ఎంపిడిఒకు రూ.25వేలు కళాజాత, ప్రచార నిమిత్తం అందజేసినట్లు తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని గ్రామం ఉండకూడదనే లక్షం కంటే ముందే ఒడిఎఫ్‌ను సాధించాలన్నారు. జగిత్యాల పట్టణంలో ఒక్కరోజులో 17వేల మరుగుదొడ్లు నిర్మించినప్పుడు మన స్థాయి ఎలా ఉందో ఆలోచించాలని అధికారులకు కలెక్టర్ హెచ్చరించారు. గ్రామ పంచాయితీ పరిధిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయని, మరుగుదొడ్లు నిర్మించుకున్నవి ఎన్ని? లేనివి ఎన్ని? మంజూరైనవి ఎన్ని? దృష్టిలో పెట్టుకుని పూర్తిస్థాయిలో సంబంధిత అధికారులకు అందజేయడంతోపాటు ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో నమోదు చేయాలని లబ్దిదారులను మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా వారిని ప్రోత్సహిస్తూ తగిన సూచనలు, సలహాలు అందించి రాష్ట్రంలో జిల్లాను ఒడిఎఫ్‌లో ప్రథమస్థానంలో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.దామోదర్‌రెడ్డి, డిఆర్‌డిఓ గణేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు, పంచాయితీ సెక్రటరీలు, ఎస్‌బిఎం ప్రేరక్‌లు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments