Search
Monday 19 March 2018
  • :
  • :
Latest News

మార్క్ ఫెడ్ తీరు మారేనా…

speak

మనతెలంగాణ/భైంసా: భైంసా ట్టణంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొన సాగుతున్న మినుముల కొనుగోల్ల తీరుతో సంబందిత శాఖ అభాసు పాలవుతుంది. రైతుల కోసం పనిచేయాల్సిన ఆ శాఖ అధికారులు దళా రులకు దన్నుగా నిలుస్తుండంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆరుగాలం శ్రమించి వచ్చిన కొద్ది పంటను విక్రయిద్దామంటే చుక్కలు చూడాల్సి వస్తుందని రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నరు. రైతుల వద్ద కొనుగోలు చేసిన దళారుల మినుములను అఘమేఘల మీద కొను గోల్లు జరుపుతు తమకు మాత్రం అవస్థల పాలు చేస్నున్నారని రైతులు విమర్శిస్తున్నారు. ఈ విషయంలో వారు ఎంఎల్‌ఏ విఠల్ రెడ్డికి మోర పెట్టుకున్నారు. ఎంఎల్‌ఏ సంబందిత శాఖ అధికారి కోటేశ్వరావ్‌తో చర వాణిలో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదే శించారు. అంతే కాకుండా ఈ విషయంలో సంబందిత శాఖ మంత్రితో మాట్లాడతనని రైతులు ఇబ్బందులు పడకుండ చూడలని సూచించారు. అయితే అధికారులు రైతులకు ఉపాయోగపడాల్సిన కొనుగోలు కేంద్రా న్ని దళారుల స్థావరంగా మార్చేశారని ఈ విషయంలో పెద్ద ఎత్తున చేతు లు మారుతున్నయన్న ఆరోపణలు ఉన్నాయి. దళారుల వద్ద పనికి రాని మినుములను సైతం తూకం వేసి కొనుగోల్లు జరిపి మార్క్‌ఫెడ్ బురిడి కొట్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రారంభం నుండి మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రం వివాద స్పదంగా మారుతుంది. ఐదారు సార్లు తమకు న్యాయం చేయాలని రైతులు అందోళనకు దిగారు. విసిగెత్తి పోయిన రైతులు ఒకసారి ఆగ్రాహంతో మార్క్‌ఫెడ్ అధికారులపై దాడి కి సైతం యత్నించారు. అయిన అధికారులు మాత్రం దళారుల వైపే మోగ్గుచేపారు. తీంతో విసుగు చెందిన రైతులు సోమవారం ఎంఎల్‌ఏ ను ఆశ్రయించారు. తమకు న్యాయం జరిగేల చూడాలన్నారు. ఎంఎల్ ఏకు మినుము రైతులు మొర పెట్టుకోవడంతోనైన సంబందిత అధికా రుల్లో మార్పురావాలని మినుము రైతులు కోరుతున్నారు.

Comments

comments