Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

సమస్యలపై మేయర్ దృష్టి

mayer

మనతెలంగాణ/నిజామాబాద్: నగరంలో నెలకొన్న సమస్యలపై, జనంలోకి పర్యటించి సమస్యలపై  నగర మేయర్ ఆకుల సుజాత దృష్టి సారించారు. ప్రతిరోజు ఏదో డివిజన్లలో పర్యటిస్తూ స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ అక్కడ జనంతో మమేకం అవుతున్నారు. నగర తొలి మహిళా మేయర్ ఆకుల సుజాత జనంతో మేయర్ కార్యక్రమాన్ని ప్రజలనుంచి అనూహ్య స్పందన లభి స్తుంది. తనతోపాటు నగర పాలక సంస్థకు సంబంధించిన వివిధ విభా గాల అధికారులతో కాలనీల్లో పర్యటిస్తున్నారు. స్వయంగా ప్రజల వద్ద కు వెళ్లి ఎలాంటి సమస్య ఉందోనని తెలుసుకుంటున్నారు. అత్యధికం గా మురికి కాల్వలు, చెత్త తొలగించకపోవడంపై స్థానికులు మేయర్‌కు వివరిస్తున్నారు. దీనిపై స్పందించిన మేయర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత అధికారులకు ఆదేశించడం పట్ల హర్షం వ్య క్తం చేస్తున్నారు. ఈ నెల 8న ప్రారంభమైన జనంతో మేయర్ కార్యక్ర మం నిరంతరం కొనసాగుతుంది. శుక్రవారం నగరంలోని 17,18వ డివిజన్‌ల్లో పర్యటించారు. జెండా బాలాజీ మందిరం దిగువ ప్రాంతం నుండి మొదలైన మేయర్ పర్యటన డివిజన్ మొత్తం సాగింది. మురికి వ్యవస్థ బాగా లేదని ప్రజలు వివరించడంతో వెంటనే సానిటేషన్ సిబ్బం దిని మందలించారు. 17వ డివిజన్‌లో పర్యటించిన మేయర్ స్థానికులు సమస్యలను వెల్లడించారు. వీధి దీపాలు సక్రమంగా లేవని, నీటి సౌక ర్యం సమస్య తీవ్రంగా ఉందని డివిజన్ ప్రజలు వివరించడం సకాలం లో స్పందించి సమస్య పరిష్కారం దిశగా ఆదేశాలు జారీ చేశారు. పలు చోట్ల చెత్త బుట్టలలో నీరు నింపుతున్న వారిని చూసిన మేయర్ ఇందుకుతడి, పొడి చెత్తలను మాత్రమే వినియోగించాలని, రోడ్లపై మురికి కాల్వల్లో చెత్తవేయవద్దంటూ ప్రజలకు పిలుపు నిచ్చారు. మేయర్‌తో పాటు స్థానిక కార్పోరేట ర్‌లు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలకు పరిష్కరి ంచేందుకు పాటు పడుతున్నారు. ఆమె వెంట 18వ డివిజన్ కార్పొరేటర్ గంగామణి, 7వ సూదం లక్ష్మి,17వ డివిజన్ కార్పోరేటర్ సు వర్ణ, టిఆర్‌ఎస్ నాయకులు నరేంధర్‌గౌడ్, సిర్పరాజు, మున్సిపల్ కమీషనర్ జాన్‌శ్యాం సన్, ఎస్‌ఇ బాలముని, డిప్యూటి ఇఇ రషీద్, ఎఇ పావని, ఎంహెచ్‌ఓ సాజిద్ అలీ, సిద్దిరా మేశ్వర్, ఆర్‌ఓ నరేంధర్, ప్రవీణ్, శోభ, రాణి, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Comments

comments