Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

‘ఎంసిఎ’ టీజర్ వచ్చేసింది…

MCA-Teaser

హైదరాబాద్:  నాచురల్‌ స్టార్‌ నాని, ‘ఫిదా’ ఫేం సాయిపల్లవి జంటగా తెరకెక్కిన సినిమా ‘ఎంసిఎ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి)’. చిత్ర యూనిట్ శుక్రవారం ఈ మూవీ టీజర్ ను విడుదల చేసింది. వరుస విజయాలతో జోరుమీదున్న నాని, ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయచేసిన సాయిపల్లవి ‘ఎంసిఎ’తో మరో విజయాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే ఇద్దరు నాచురల్‌ యాక్టింగ్ తో ఇరగదీసినట్లు అర్ధమవుతోంది.  టీజర్ లో నాని పలికిన ‘ఎంసిఎ అంటే మైండ్‌సెట్‌. ఎప్పుడైనా షర్ట్‌ బటన్‌ వూడిపోతే పిన్నీస్‌ పెట్టుకుని మ్యానేజ్‌ చేశావా? మామూలు జీన్స్‌ని బ్లేడ్‌తో కట్‌ చేసి టోర్న్‌ జీన్స్‌లా కలర్‌ ఇచ్చావా? అంతెందుకు ఎప్పుడైనా అలా రోడ్డుపై వెళ్తూ బస్‌స్టాప్‌లో ఓ అందమైన అమ్మాయిని చూసి ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఓ ఫ్యామిలీ ఫొటోను వూహించుకున్నావా? ఇవన్నీ చేసుంటే తెలిసేది ఎంసిఎ అంటే ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయని’  అనే డైలాగ్‌ యువతను ఆకట్టుకుంటుంది. అలాగే టీజర్ చివరలో సాయి పల్లవి ‘నువ్వు నాకు బాగా నచ్చావ్‌. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం’  అని నానిని అడగటం హైలైట్‌గా ఉంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ బాణీలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments