Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

మందుల వ్యాపారం .. మామూళ్ల వ్యవహారం

tablet

మనతెలంగాణ/మహబూబాబాద్ ఎడ్యుకేషన్: మహబూబాబాద్ జిల్లాలోని మెడికల్ షాపు యజమానుల సమావేశం పరస్పర విమర్శలు, ఆరోపణలు, వాగ్వాదాలతో రసాభాసగా సాగింది. జిల్లాలో డ్రగ్స్ అధికారులకు నెలకు 10లక్షలకు పైగా మామూళ్లు చెల్లించే విషయంలో యాజమానుల మధ్య జరిగిన చర్చ రచ్చ రచ్చ అయ్యింది. మామూళ్లు ఎందుకు ఇవ్వాలని కొందరు, ఇవ్వాల్సిందేనని మరికొందరు. వ్యాపారం చేసుకునే వాళ్ళం మామూల్లు, పర్సంటేజీలు ఎందుకు ఇవ్వాలని అడుగగా జనరిక్ మందులు విక్రయిస్తున్నాం. అధికారులు తలుచుకుంటే ఏమైనా చేస్తారని మరికొందరు వాదించుకున్నట్లు సమాచారం. జిల్లా మెడికల్ యాజమాన్యం రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రంగా వాదులాడుకున్నారు. ఒకానొక దశలో ముష్టి యుద్ధానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన నాయకులు సముదాయించారు. సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ ప్రాంతం నుంచి ప్రతి నెల షాపునకు ఇంత అం టూ యూనియన్ మాజీ రెడ్డి వసూలు చేసి డ్రగ్స్‌నాయక్‌కు ఇచ్చేవా రు. తాను కొంత మింగేవాడు. 10ఏళ్ళుగా ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది. జిల్లాలు ఏర్పడిన తరువాత మహబూబాబాద్ జిల్లా మెడికల్ షాపుల యాజమాన్యం ‘రెడ్డి’ని,  నాయకుడిని ఈ బాధ్యతలనుండి తప్పించి అదే స్థానంలో మరో ‘రావు’సార్‌ని ఎన్నుకున్నారు. ఇదే సమయంలో గతంలో వరంగల్ లో లక్షలు మింగిన నాయక్ డ్రగ్ అధికారిగా మానుకోటకు వచ్చాడు. తనకు రావలసిన మామూల్ల గురించి రెడ్డిని వాకబ్ చేశాడు. అయితే ఆయన తాను పదవిలో లేనని, రావును అడగాలని సూచించారు. డ్రగ్ అధికారి రావుని పిలిపించి తన ఉల్పాను నెల వారి ఖర్చుల జాబితాను, వాహనాల ‘డిజిల్’ ఆఫీసు ఖర్చులు, అటెండర్ ఖర్చులు అన్ని ఏకరువుపెట్టి నెలకు రూ.5లక్షల డిమాండ్‌చేశాడు. దీంతో ఒళ్లుమండిన రావు సార్ ఇదే విషయాన్ని ప్రజాప్రతినిధులను కలిసి రాజదాని వెళ్ళి ఆరోగ్యశాఖ మంత్రి చెవిలో వేశారు.  ఒక జిల్లాకు నెలకు రూ.5లక్షలా అని మంత్రి ఆశ్చర్యపోయారు. లిఖితపూర్వక ఫిర్యా దు తీసుకున్నారు. డ్రగ్ అధికారిని వెంటనే పిలిపించి మందలించా రు. దాంతో ఖంగుతిన్న డ్రగ్ అధికారి మంత్రి కాళ్ళవేళ్ళ పడి బ్రతు కు జీవుడా అంటూ మానుకోట చేరారు. ఇదే కక్షతో మాజీ రెడ్డి సహకారంతో రావుకు అనుకూలంగా ఉన్న మందుల దుకాణాలపై దాడులుచేశారు. సీజ్ చేయకుండా రెండు రోజులపాటు దుకాణాల ను మూయించారు. దాంతో ఆగ్రహించిన రావు వెంటనే విషయం ప్రజాప్రతినిధికి చేరవేశాడు. ప్రజాప్రతినిధి చివాట్లు పెట్టడంతో అధికారులు మందుల షాపుల తాళాలు ఇచ్చి వేశాడు. యూనియన్ నాయకునిగా ‘రావు’ను  తొలగించాలి, తనకు అనుకూలంగా ఉన్న రెడ్డిని నియమించాలని ఆ అధికారి మందులషాపు యజమానులకు ‘హుకుం’ జారీచేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీ మొత్తం అసోసియేషన్‌కు చేరింది. మెడికల్ యాజమానులు ఎస్‌ఎస్‌వీఎల్ ఫంక్షన్‌హాల్‌లో సమావేశమయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకునే క్రమం లో వారిలో వారికి తీవ్ర వాగ్వాదం జరిగింది. పరస్పరం వాదులాడుకున్నారు. మూమూళ్ళలో ఎవరివాటా ఎంత అని రాష్ట్ర అధికారులకు, పార్టీలకు, విలేకరులకు అని చెప్పి వసూలు చేసిన డబ్బంతా ఎటుపోతుందనే చర్చ జరిగింది. అన్నింటికి లెక్కలు చెప్పాలని చిన్నషాపుల వారు డిమాండ్‌చేశారు. రావుని తప్పించాలని కొందరు, వద్దని కొందరు వాదులాడుకున్నారు. ఎటూ తేల్చలేక యూనియన్ నాయకులు తలలుపట్టుకున్నారు. గిరిజనులను, దళితులను అక్రమంగా దోచుకుంటున్న మందుల షాపుల్లో విజులెన్స్ దాడులు చేయాలని, అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్న డ్రగ్ అధికారిపై ఏసీబీ దాడులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

comments