Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

సినిమా నచ్చితేనే మౌత్ పబ్లిసిటీ చేయండి

srbశ్రీవిష్ణు, నివేథా పెతురాజ్  జంటగా ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘మెంటల్ మదిలో’. రాజ్ కందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. డి.సురేష్‌బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో డి.సురేష్‌బాబు ఈ చిత్రంలోని నాలుగో పాట ‘ఏదోలా ఏదోలా…’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డి.సురేష్‌బాబు మాట్లాడుతూ “మా సినిమా బావుందని చూడమని ప్రతిరోజు ఫిల్మ్‌మేకర్స్ ప్రెస్‌మీట్‌లో చెబుతుంటారు. కానీ మా సినిమా ప్రివ్యూలను సోమవారం నుంచి వేస్తాం. సినిమా చూసిన వారికి నచ్చితేనే మౌత్ పబ్లిసిటీ చేయండి చాలు”అని అన్నారు. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ “మెంటల్ మదిలో చిత్రంలో గందరగోళంగా ఉండే అబ్బాయిగా శ్రీవిష్ణుని చూపిస్తున్నాం. సురేష్‌బాబుకు ఈ సినిమా నచ్చి విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. నివేథా తమిళంలో రెండు సినిమాలు చేసిన నాయిక. ఈ చిత్రం ద్వారా ఆమెను టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాం. ఈనెల 20న హైదరాబాద్‌లోని సైబర్ కన్వెన్షన్‌లో  ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తాం. ఈనెల 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఈ సినిమాను దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ మంచి బాణీలిచ్చారు”అని అన్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ “కొంతకాలం క్రితం నేను ఈ కథను నిర్మాతకు చెప్పగా ఆయనకు నచ్చి ఈ సినిమా చేశారు. హీరో శ్రీవిష్ణు అద్భుతంగా నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది”అని తెలిపారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ “మూడు సినిమా పాటలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. రచయితలు మంచి పాటలు రాశారు”అని చెప్పారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ “యంగ్, ఫ్రెష్ టీమ్ కలిసి పనిచేసిన సినిమా ఇది. సినిమా చూశాక చాలా హ్యాపీగా అనిపించింది. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నివేథా, మధుర శ్రీధర్, కిరీటి దామరాజు పాల్గొన్నారు.

Comments

comments