Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

ఏలియన్లకు సందేశం..!

Harivilluగ్రహాంతర వాసుల ఉనికి తెలుసుకునేందుకు సమీప నక్షత్రంపైకి శాస్త్రవేత్తలు  రేడియో సందేశాన్ని పంపారు. భూమికి 12 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న జీజే 273 నక్షత్రానికి రేడియో సందేశాలను  మెసేజింగ్  ఎక్‌స్ట్రాటెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నేషనల్ ( ఎంఈటీఐ) పంపింది. ఈ నక్షత్రం రెండు గ్రహాలను కలిగి ఉందని శాస్త్రజ్ఞులు తెలిపారు. అందులో ఒకదానికి జేజీ 273బీ అని పేరుపెట్టారు.  జీవుల ఆవాసానికి అనుకూల వాతావరణమున్న గ్రహం కావడంతో దీనిపై గ్రహాంతరవాసులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. నీటి జాడ ఉండటంతో జీవరాశి ఉండే అవకాశముందంటున్నారు. జీజే273పై జీవరాశి ఉన్నట్లయితే రేడియో సందేశాల ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.  ఆ జీవరాశి ఏలియన్లా కాదా అనేది తెలుసుకునేందుకు మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని ఎంఈటీఐ శాస్త్రవేత్తలు అంటున్నారు. అవి ఏలియన్లు కాకుండా ఇతర జీవరాశి అయినా మా కష్టం ఫలించినట్లే అని శాస్త్రవేత్త డగ్లోస్ వాకోచ్ వెల్లడించారు.

Comments

comments