Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులకు మోక్షం

Harish-Rao

హైదరాబాద్: శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. లోయర్ పెన్‌గంగా, ప్రాణహిత, సదర్‌మాడ్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. సదర్‌మాడ్ ప్రాజెక్టును వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసి తీరుతామన్నారు. కుఫ్తీ ప్రాజెక్టుకు త్వరలోనే పరిపాలన అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఇక లోయర్ పెన్‌గంగ పనులు కూడా యుద్ధ ప్రతిపాదికన జరుగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. మూడున్నరేళ్లలో రెండున్నర లక్షల ఆయకట్టును సాగులోకి తెచ్చామని ఆయన గుర్తు చేశారు. దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులకు మోక్షం కలిగించిన్నట్లు చెప్పుకొచ్చారు. వాన నీటిని నిలువ చేసేందుకు కొత్త చెరువుల తవ్వకం చేపట్టినట్లు మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.

Minister Harish Rao Speech in Legislative Council on Irrigation Projects.

Comments

comments