Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

సాగునీరందించేందుకు కృషి

jply2కెఎల్‌ఐ కాల్వను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

పాన్‌గల్: రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందని అందుకోసం సిఎం కెసిఆర్ సారథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటు పడుతూ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయ డంతో పాటు పాలమూర్ ,రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగిందని పంచాయతీ రాజ్ గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళ వారం  మండలంలోని గ్రామాల మీదుగా వెళ్లిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కెనాల్‌ను పరిశీలించారు. కొత్త పేట శివారులోని, బుసిరెడ్డిపల్లి గ్రామ   బొల్లిగట్టు సమీపంలో  భీమా  డిస్ట్రిబ్యూటర్ 27వ కెనాల్‌పై  వెళ్లిన కెఎల్‌ఐ వంతెన కాల్వలను  మంత్రి ప్రారంభించారు. ఈ కాల్వల ద్వారా బుసిరెడ్డిపల్లి, మహ్మదాపూర్ తదితర గ్రామాల రైతుల పంట పొలాలకు సాగునీరందుతుంద న్నారు. రేమద్దుల దగ్గర డిస్ట్రిబ్యూటర్ 8 కెనాల్ లో కొన్ని సమస్యల వల్ల నీరు ముందుకు రాలేకపోతుందని, త్వరలోనే సమస్యలను పరిష్కరించి పాన్‌గల్, దావాజిపల్లి, గోప్లాపూర్ అన్నారం, కోడేర్ మండలంలోని గ్రామాలకు సాగు నీరందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంలో కాల్వ పరిస రాల్లోని వ్యవసాయ పంటలు సాగు చేసిన రైతులతో మంత్రి కొద్ది సేపు ముచ్చటించారు.కాల్వల ద్వారా నీరు ఎలా అందుతుందని ,వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరాల్లో ఏవైనా అంతరాయాలు ఉన్నాయా  అని రైతుల నుండి మంత్రి సమాచారం సేకరించారు. మంత్రి వెంట మార్కెట్ కమిటి చైర్మన్ రాంచంద్రారెడ్డి, జడ్పిటిసి కేతేపల్లి రవి, ఎంపిపి వెంకటేష్‌నాయుడు, తెరాస అధ్యక్షులు గోవర్ధన్‌సాగర్, విండో చైర్మన్, వైస్ చైర్మన్ బాల్‌రెడ్డి, భాస్కర్ యాదవ్,నాయకులు కేతేపల్లి విష్ణు, రాజేశ్వర్‌రెడ్డి, నారాయణరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జూపల్లి.. మండల కేంద్రానికి చెందిన ఎంపిటిసి రాంచందర్‌యాదవ్, రిపోర్టర్ రాములు యాదవ్‌ల తండ్రిమంగదొడ్డి కిష్టయ్య సోమవారం అనారోగ్యంతో మృతి చెందడంతో సమాచారం తెలుసుకున్నమంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం గ్రామానికి చేరుకొని యాదవ శ్మశానవాటికలో కిష్టయ్య మృత దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈసందర్భంగా వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Comments

comments