Search
Monday 19 February 2018
  • :
  • :
Latest News

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం…

KTR1

హైదరాబాద్ : హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. రాత్రికి రాత్రే విశ్వనగరాలు తయారు కావని ఆయన అన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. నగరంలో తాగు నీటి కొరత లేకుండా చేశామని ఆయన స్పష్టం చేశారు. మంచినీటి సరఫరా విషయంలో ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో వెయ్యి కోట్లు ఖర్చు చేశామని, లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించేందుకు టెండర్లు పిలిచామని ఆయన చెప్పారు. నగరంలో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించామన్నారు.

Minister KTR Comments on Drinking Water

Comments

comments