Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

మురుగు నీటి కాలువల నిర్వహణకు చర్యలు

ktr

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలోని మురుగు నీటి కాలువల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో కెటిఆర్ మాట్లాడుతూ… ముగరు నీటి కాలువల వ్యవస్థపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. నగరంలోని నాలాలు, చెరువులు కబ్జాకు గురికావడంతోనే వర్షకాలంలో ప్రజల అవస్థలకు కారణమని మంత్రి తెలిపారు. దాంతో నాలాలపై వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు చెప్పారు. అలాగే నాలాల విస్తరణ కూడా జరుగుతుందన్నారు. దీంతోపాటు చెరువుల అభివృద్ధికి తగిన చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

Minister KTR Talks in Legislative Assembly about Drainage System.

Comments

comments