Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

ఆర్‌టిసి బలోపేతానికి చర్యలు: మహేందర్‌రెడ్డి

Mahender-Reddy

హైదరాబాద్: శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్ర ఆర్‌టిసి బలోపేతంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆర్‌టిసిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆర్‌టిసిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాయితీలను విడుదల చేస్తుందన్నారు. 2015-16లో కొత్త బస్సుల కొనుగోలుకు రూ. 39 కోట్లు, 2016-17లో రూ. 10 కోట్లు, 2017-18లో ఎసి బస్సుల కొనుగోలుకు రూ. 140 కోట్లు కేటాయించిన్నట్లు చెప్పారు. అలాగే ఆర్‌టిసికి జిహెచ్‌ఎంసి రూ. 336 కోట్లు విడుదల చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ నుంచి ఎపి, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్‌లకు బస్సులను నడుపుతున్నామని పేర్కొన్నారు. 31 బస్టాండ్లలో మిని థియేటర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచామని, వీటి ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 4 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు. బస్టాండ్లలో 105 పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్‌టిసిని బలోపేతం చేసేందుకుగాను ప్రైవేటు వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేగాక ఆర్‌టిసి ఉద్యోగుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

Comments

comments