Search
Wednesday 22 November 2017
  • :
  • :

అప్పులక్ష దాటితే వడ్డీ రైతులే కట్టుకోవాలి

 

Pocharam-1

హైదరాబాద్: లక్షలోపు రుణాలున్న రైతులందరికీ రుణంతో పాటుగా వడ్డీ కూడా మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ తెలిపారు. సభలో ప్రతిపక్షలు రుణమాఫీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఒక వేళ లక్షకి పైగా అప్పు ఉంటే వడ్డీని రైతులే కట్టుకోవాలన్నారు. రూ. 16వేల 134 కోట్ల వడ్డీతో సహా రుణమాఫీ చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా బాకీ లేమని మంత్రి ఈ సందర్భంగా సభలో విన్నవించారు. 35 లక్షల 30 వేల మందికి పైగా రైతులకు రుణాలు మాఫీ చేసిన్నట్లు వెల్లడించారు.  రుణామాఫీ విషయంలో సర్కార్ వైఫల్యం చవిచూసిందనే ప్రతిపక్షాల ఆరోపణలను మంత్రి పోచారం ఖండించారు.

Comments

comments