Search
Monday 11 December 2017
  • :
  • :

మిషన్ భగీరథ డిసెంబర్ 20నాటికి పూర్తి

sir

మన తెలంగాణ/కామారెడ్డి: మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ పనులను,పైప్‌లైన్‌ను డిసెంబర్ 20నాటికి, ట్యాం కులు, సంపులు, ఓవర్ హెడ్ బ్యాలన్స్ రిజర్వాయర్ ప నులను డిసెంబర్ 25 నాటికి  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులు ఎస్సారెస్పీ బాల్కొండ సెగ్మెంట్ ద్వారా 7మండలాలైన కామారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, బిక్కనూర్, దోమకొండ, తాడ్వాయి, గాంధారి మండలాల్లో 679 కీ.మిల పైప్‌లైన్‌లు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. బాల్కొండ సెగ్మెంట్‌లో 309 గ్రామాలలో 300 మీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పెండింగ్ లో ఉందని మిషన్ భగీరథ అధికారులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్‌ఎస్ నగర్ మర్కల్ గ్రామంలో మ ల్లన్న గుట్ట వద్ద 30 ఎంఎల్‌డి ప్లాంట్‌ను ప్రతి రోజు శుద్దీకరణ చేసి త్వరలో ప్రజలకు నీ రందిస్తామన్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామప్రజలకు డబుల్ బెడ్రూమ్ పథకం ద్వారా ప్రభుత్వం నిరుపేదలకు 6.50 లక్షల ద్వారా ఇళ్లు కట్టిస్తుందని అట్టి లబ్ధిదారులను త్వరలోనే ఎంపిక చేస్తామన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పర్యటనలో వికలాంగుడు అయిన చిన్నారికి సదరం సర్టిఫికేట్ ఇ ప్పించాలని కోరగా న్యాయం చేస్తానని మండలాభివృద్ధ్ది అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శైలజ ,జడ్పీటిసి రా జేశ్వర్, ఎంపిటిసి యాదగిరి, మిషన్ భగీరథ డిఈ రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments